Home పెద్దపల్లి బొగ్గు గనుల్లో దోపిడీపై బిగిసిన పిడికిలి

బొగ్గు గనుల్లో దోపిడీపై బిగిసిన పిడికిలి

Mines-Fruad

గోదావరిఖని: ‘20 ఏళ్లుగా దే శంలోని బొగ్గు గనుల్లో, ముఖ్యంగా ప్రభుత్వ రం గ సంస్థల్లో శ్రమదోపిడీ పెరుగుతోంది. ఫలితం గా లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబి కులు దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే ఐక్య కార్మికోద్యమాలే శరణ్యం’ అని కార్మిక సంఘాల ప్రతినిధులు ఉ ద్బోదించారు. అంతర్జాతీయ ద్వితీయ గని కార్మి కుల మహాసభల సందర్భంగా గోదావరిఖనిలోని సింగరేణి జిఎం కార్యాలయ మైదానంలో గురు వారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడారు.

బహుళ జాతి కంపెనీలు, కార్పోరేటు శక్తులు బొగ్గు గను ల రంగంలో ప్రవేశించి దోపిడీని కొనసాగిస్తున్నా యని, ఈ చర్యల ఫలితంగా రైతు లు, గిరిజను లు భారీ ఎత్తున నిర్వాసితులుగా మా రుతున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రం గ బొగ్గు గనుల సంస్థల్లో వ్యయాన్ని తగ్గించే పేరిట పర్మి నెంటు కార్మిక నియామకాలను రద్దుచేసి కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పేరిట తాత్కాలిక పద్ధతిలో కార్మికులను నియమించుకుని భారీ ఎత్తున శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కనీస వేతనాలు, ఇతర అలవెన్సులు చెల్లించకుండా, కార్మికులకు, వారి కుటుంబికులకు వైద్య, నివా స సౌకర్యాలు కల్పించకుండా అన్యాయం చేస్తు న్నారని వక్తలు వివరించారు.

దేశవ్యాప్తంగా, ఇత ర అనేక దేశాల్లోనూ కొనసాగుతున్న ఈ దోపిడీ, అన్యాయాలను అరికట్టాలంటే కార్మికుల ఐక్య పోరాటాలే శరణ్యమని వివరించారు. ఈ మహా సభకు భారత కార్మిక సంఘాల సమాఖ్య నేత పి.కె.మూర్తి అధ్య క్షత వహించగా అంతర్జాతీయ కార్మిక నేత ఆండ్రియాస్, ప్రొఫెసర్ హరగోపా ల్, ఐఎఫ్‌టియు నేతలు బి.ప్రదీప్, సుదీప్త, సో మనాథ్, బచ్చసింగ్, ఎస్. వెంకటేశ్వర్‌రావు, విఠ ల్‌రాజు, సంజయ్ సంగ్వి, గౌతమ్ మోడీ, విజ య్‌కుమార్‌తో పాటు అంతర్జా తీయ సమన్వయ బృందం (ఐ.సి.జి) పెరూ, కొలంబియా, కజికి స్తాన్, కాంగో దేశాల ప్రతినిధులు ప్రసంగించా రు. మూడున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ బహిరంగ సభకు సింగరేణిలోని వివిధ డివిజన్ల నుంచి కార్మికులు, యూనియన్ ప్రతినిధులు, కా ర్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చారు. అంతర్జా తీయ మహాసభల సందర్భంగా కోల్‌సిటీ గోదా వరిఖని ప్రధాన వీధులన్నీ జనం రద్దీతో కిక్కిరిసి పోయాయి. బహిరంగ సభ వేదికపై అరుణోద య కళాకారులతో పాటు, విదేశీ కార్మిక ప్రతి నిధులు విప్లవ చైతన్య గీతాలను ఆలపిస్తూ నృత్య ప్రదర్శన చేశారు.