Home కరీంనగర్ కాళేశ్వరంలో పారిశుధ్యం అధ్వాన్నం

కాళేశ్వరంలో పారిశుధ్యం అధ్వాన్నం

  • పుష్కర వ్యర్థాలతో దుర్వాసనమయం
  • కంపు కొడుతున్న పాఠశాలలు
  • ఇబ్బందుల్లో విద్యార్థులు
  • ఎస్‌సి కాలనీలో విషజ్వరాలు

Karimnagar_Kaleshwaram_Dirtమహదేవపూర్: కాళేశ్వరంలో గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. పుష్కరాలకు దేశ నలమూలల నుంచి కనీవిని ఎరుగని రీతిలో సుమారు 60లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. 12 రోజులు సుదూర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు కాళేశ్వరం వచ్చి పుష్కర స్నానాలు ఆచరించి దైవదర్శనాలు చేసుకున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఇక్కడ, ఎక్కడ చూసిన పారిశుద్య లేమితో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. ఓ వైపు ఎస్పీ కాలనీలో విష జ్వరాలతో గ్రామ స్తులు అల్లాడుతున్నారు. ఇంటికి ఇద్దరు మంచానికే పరిమిత మయ్యారు. 12 రోజులుగా కాళేశ్వరంలో గోదావరి పుష్కరాల భక్తులతో కిటకిటాలాడారు. హోటళ్లు, కిరాణ దుకాణాలు,అన్నదాన సత్రాలు, ఆలయ పరిసరాలు, గోదావరి తీరం, ఘాట్లు, ప్రభుత్వ పాఠశాలలైన మజీద్ పల్లి, పూస్కుపల్లి, గిరిజన బాలికల వసతి గృహాల వద్ద వ్యర్ధాలతో తీవ్ర దుర్గంధం వెదజుల్లతోంది. ముక్కుకు గుడ్డకట్టుకొని మాత్రమే రహదారి వెంట నడవాలసిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా శానిటేషన్ అధికారులు పుష్కరాల అనంతరం ప్రధాన రహదారులను మాత్రమే పట్టించుకోవడంతో లోపల వీధుల్లో ఉన్న వ్యర్ధాలను పూర్తి స్థాయిలో తొలగించలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పుష్కరాల విధులకు వచ్చిన ఉద్యోగులు, పోలీసులకు సంబంధించి బ్యారక్‌లో పడేసిన చెత్తచెదారంతో పాఠశాల పరిసరాలు కంపుకొడుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యా యులు ముక్కుమూసుకుని తరగతి గదుల్లో కూర్చోవలసిన దుస్థితి నెలకొంది. కొంత మంది విద్యార్థులు బడికి రావాలంటే జంకుతున్నట్లు తల్లిదండ్రులు మొరపెడుతున్నారు. జిల్లా అధికారులు రెండు రోజులు ప్రధాన రహదారి వెంట రెండు సార్లు శుభ్రం చేసి చేతులు దులుపుకున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాళేశ్వరంలోని పార్కింగ్ స్థలాలు,ఆలయ పరిసరాలు, పాఠశాలల్లో బ్లీచింగ్ చేసిన ఫలితం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చెత్తచెదారరం తొలగించకండానే బ్లీచింగ్ చల్లుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరంలోని ఎటు చూసిన 4కిలోమీటర్ల మేర అడవిలో కంపు వాసన, పలు వ్యర్ధ పదార్ధలతో నిండికొని ఉంది. పుష్కర స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభించడమేమో దేవుడెరుగు కాని కాళేశ్వరంలో వ్యర్ధాలతో రోగాలు అంటుకొని విష జ్వరాలు ప్రబలుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష ధోరణిలో ఎఎన్‌ఎంలు
పుష్కరాల పుణ్యమా అని కాళేశ్వరంలోని ఎస్సీ కాలనీలో ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరాలతో మంచం పట్టారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. స్థానికంగా ఉండే ఎఎన్‌ఎంలు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈపారిశధ్యం పూర్తి స్థాయిలో తొలగించకపోతే ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా వైద్యులు చర్యలు తీసుకోవాలని
ప్రజల వేడుకోలు
జిల్లా నుంచి మలేరియా టీంలు వచ్చి గ్రామస్థులకు సూచనలు,సలహాలు,తీసుకోవలసి జాగ్రత్తలు ఇవ్వాల్సి ఉన్న జాడలేదు. మలేరియా, డెంగ్యూ, కలరా, డయేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రభలకుండా జిల్లా అధికార యంత్రాంగం కాళేశ్వర గ్రామంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు.