Tuesday, March 21, 2023

’‘నేషనల్ ప్రేయర్ డే’’కు తరలిరండి..దేశంకోసం ప్రార్థిద్దాం: రెవరెండ్ మోహన్ బాబు

- Advertisement -

555

హైదరాబాద్: భారత దేశ నిర్మాణంలో క్రైస్తవులు కీలక పాత్ర వహిస్తున్నారని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నేతలు చెప్పారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘‘ తెలంగాణ స్టేట్ అండ్ నేషనల్ ప్రేయర్ డే ’’ నిర్వాహకులు బిషప్ ఎం.ఎ.డానియెల్, బిషప్ జి.జాన్, రెంవరెండ్ వై.మోహన్ బాబు, రెంవరెండ్ నెల్సన్, జిహెచ్ఎంసి కోఆప్షన్ సభ్యులు డాక్టర్ విద్యా శ్రవంతిలు మాట్లాడారు.
ఈ నెల ఐదో తేదీన సికింద్రాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో క్రైస్తవ సమాజంమంతా సామూహికంగా జాతీయ ప్రార్థనా దినం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటార్నారు. ఈ ప్రార్థనాదినంలో అమెరికాకు చెందిన ప్రముఖ క్రైస్తవ బోధకురాలు ఆనీ గ్రహం ముఖ్య అతిధులుగా పాల్గొనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిందిటి వరకు ప్రార్థనలు జరుగుతాయన్నారు. ప్రధాని మోదీ దేశంలో తలపెట్టిన స్వచ్ఛ భారత్, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కలలు కనే.. బంగారు తెలంగాణ కోసం.. క్రైస్తవులంతా సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. ఐదు లక్షల మంది ఈ జనవరి ఐదున పేరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సాముహిక ప్రార్థనల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రైస్తవులను గుర్తించిన తీరు అభినందనీయమన్నారు. రాష్ట్ర పండుగగా క్రిస్మస్ ను ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సమాజ హిత కార్యక్రమాల్లో ముందు నుంచి క్రైస్తవులు ఉత్సాహంగా పాల్గొంటున్న విషయాన్ని వారు గుర్తు చేశారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలనుండి లక్షలాది మంది ప్రజలు ఈ ప్రేయర్ డే కార్యక్రమానికి తరలిరావాలని, అందరం కలిసి స్వచ్ఛ భారత్, బంగారు తెలంగాణ నిర్మాణాల కోసం ప్రార్థనలు చేద్దామని వారు పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో క్రైస్తవ సంఘాల నాయకులు, రెంవరెండ్ కె.ఎం.జాన్, రెవరెండ్ కె.జోనాతన్, రెవరెండ్ కె.ఎస్.సిన్హా, లీవీస్, యెజెకియా, మీడియా ఇన్ చార్జీలు మైఖేల్ ఫ్రెడరిక్, జోనా రామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News