Friday, April 19, 2024

‘లక్ష్య’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Lakshya movie release on dec 10

 

యంగ్ హీరో నాగశౌర్య కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం ‘లక్ష్య’ విడుదల తేదీని ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 10న విడుదల కానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగశౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కు పెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఇందులో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పి.రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News