Thursday, April 25, 2024

నవంబర్ 12న ‘లక్ష్య’

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్ డ్రామా ‘లక్ష్య’. విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటెర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగశౌర్య లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ కేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.నారాయణ్ దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిసున్నారు.

‘Lakshya’ Movie to release on Nov 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News