Friday, January 27, 2023

సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్… ఇట్స్ ఏ జర్నీ

- Advertisement -

Lakshya pre release event

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగశౌర్య హీరోగా రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పి.రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పుల్లెల గోపీచంద్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “స్పోర్ట్ నేపథ్యం, ఆర్చరీ సినిమా కావడంతో ఈ సినిమా సగం హిట్ అయింది.

ఈ సినిమాలో హార్డ్‌వర్క్‌తో నాగశౌర్య తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కేతిక శర్మకు మంచి సక్సెస్ రావాలి”అని అన్నారు. డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. “సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ‘సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్… ఇట్స్ ఏ జర్నీ’… ఆ జర్నీయే ప్రేక్షకులు డిసెంబర్ 10న థియేటర్లలో చూసే లక్ష్య సినిమా. రైటర్ సృజనా మణి సృజనాత్మకంగా రాశారు”అని తెలిపారు. నాగశౌర్య మాట్లాడుతూ.. “ఈ సినిమా కథను 2019లో విన్నాను. ఈ సినిమా నా దగ్గరకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ కాళభైరవ అద్బుతమైన సంగీతం అందించారు. మా హీరోయిన్ కేతిక శర్మ ఈ సినిమాకు, మేం అనుకున్న పాత్రకు కరెక్ట్‌గా సరిపోయారు”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్, కేతిక శర్మ, శరత్ మరార్, కాళ భైరవ, షర్మిల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles