Saturday, April 20, 2024

నాగశౌర్య లేకుంటే ‘లక్ష్య’ బాగా వచ్చేది కాదు

- Advertisement -
- Advertisement -

Lakshya trailer release

స్పోర్ట్ డ్రామా నేపథ్యంలో నాగశౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పి.రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసి సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. “ఆర్చరీ మీద మొదటి సినిమా ఇది. నాగశౌర్య లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. పార్థు అనే పాత్రను నాగశౌర్య నెక్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. రితిక అనే పాత్రలో కేతిక శర్మ అద్భుతంగా నటించారు” అని అన్నారు. నాగ శౌర్య మాట్లాడుతూ “స్పోర్ట్ సినిమా అంటే చివరకు హీరో గెలవాలి. ప్రేమ కథలు అంటే అమ్మాయి, అబ్బాయి చివరకు కలవాలి. ఈ చిత్రంలో కూడా అలానే ఉంటుంది. కానీ చివరకు హీరో ఎలా గెలిచాడన్నది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ నన్ను 8 ప్యాక్స్ కోరింది. నేను చేశాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామ్‌మోహన్ రావు, కేతిక శర్మ, కాళ భైరవ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News