Thursday, March 28, 2024

దేశంలోకి లాంబ్డా ప్రవేశించలేదు

- Advertisement -
- Advertisement -
Lambda Variant not Reached India
వ్యాప్తి అధికమన్న ధ్రువీకరణ లేదుః కేంద్ర ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: కొవిడ్19 నూతన వేరియంట్ లాంబ్డా ఇప్పటివరకు భారత్‌లోకి ప్రవేశించలేదని, దాని వ్యాప్తి రేట్ అధికంగా ఉంటుందని ఇంకా నిర్ధారణ కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. శుక్రవారం ఈ వేరియంట్ గురించి ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాకు వివరించారు. కొవిడ్19 వేరియంట్లను జీనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) నిశితంగా గమనిస్తున్నదని అగర్వాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) గుర్తించిన ఆసక్తికర వేరియంట్లలో లాంబ్డా ఏడోదని తెలిపారు. పెరూలో తాజాగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఈ వేరియంట్‌వల్లేనన్నారు. దక్షిణ అమెరికా దేశాలు, యుకె, యూరోపియన్ దేశాల్లోనూ లాంబ్డాను గుర్తించారు.

మన దేశంలోకి ఇప్పటివరకు ఈ వేరియంట్ ప్రవేశించలేదని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్య విబాగం) వికె పాల్ తెలిపారు. మన ఇన్సాకాగ్ నిఘా వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. లాంబ్డా స్ట్రెయిన్ వ్యాప్తి రేట్ అధికమని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఒత్తిడికి గురవుతోంది. అది తన మనుగడ సాధించాలంటే లక్షణాలను మార్చుకొని కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందాలని, అటువంటి వేరియంట్లు ఏవీ ఇప్పటి వరకు దేశంలోని ఏ భాగంలోనూ కనిపించలేదని పాల్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News