Saturday, April 20, 2024

దిగివస్తున్న శివారు భూముల ధరలు

- Advertisement -
- Advertisement -

land prices are falling in telangana

దశాబ్దకాలంలో భారీగా తగ్గిన ఇళ్ల ధరలు
రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన గట్ల పంచాయతీలు
సర్వే చేయాలని రెవెన్యూకు పెరిగిన దరఖాస్తులు

హైదరాబాద్ : తక్కువ ధరలకు ఇళ్లను విక్రయించడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారని రియల్‌రంగం నిపుణులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోవడం, వలస కార్మికులు, రుణ లభ్యత లేకపోవడం వంటి కారణాల వల్ల కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహ విక్రయాలు తగ్గాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019సంవత్సరంతో పోలిస్తే 2020 ప్రథమార్ధానికి హైదరాబాద్‌లో గృహ విక్రయాలు 43 శాతం క్షీణించినట్టుగా ఓ రియల్ సంస్థ తమ అధ్యయనంలో పేర్కొంది. ఇళ్ల ధరల పరిస్థితి ఇలా ఉంటే భూముల ధరలు తగ్గకపోయినా కొనుగోళ్లు మాత్రం నిలిచిపోయాయని, స్థానికంగా వివాదాలు ఎక్కువయ్యాయని తెలిపింది.

వివాదాస్పదంగా క్రయ, విక్రయాలు..

దీంతో పాటు లాక్‌డౌన్ నేపథ్యంలో సిటీల్లో ఉండే ప్రజలు పల్లెదారి పట్టడం తమ సొంత భూమితో పాటు గతంలో అమ్మిన భూములపై దృష్టి సారించడంతో అక్కడ గట్ల పంచాయతీలు ఎక్కువయ్యాయని, ఈ నేపథ్యంలో భూ వివాదాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. క్రయ, విక్రయాల మాట దేవుడెరుగు గట్ల పంచాయతీలతో భూములు వివాదాస్పందగా మారుతున్నాయని రియల్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

భూమిని సర్వే చేయాలని 50 వేల దరఖాస్తులు..

జూన్ నెల నుంచి ఇప్పటివరకు చాలా మండలాల్లో గట్ల పంచాయతీలతో పాటు భూ వివాదాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పోలీసు, రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు (ఆరేళ్లలో) అడంగల్/పహాణీల కోసం 96.88 లక్షల దరఖాస్తులు రాగా, ఖాస్రా పహాణీల కోసం 55 వేల దరఖాస్తులు, పాత పహాణీల కోసం 1.32 లక్షల మంది ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో 10 శాతం దరఖాస్తులు ఈ రెండునెలల్లో వచ్చినవే. దీంతోపాటు భూములను సర్వే చేయాలని రెండునెలల్లో 50 వేల మంది దరఖాస్తు చేసుకోవడం గమన్హారం. ఆరేళ్ల కాలంలో భూములను సర్వే చేయాలని 2.04 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని రెవెన్యూ గణాంకాలు చెబుతున్నాయి.

అత్యవసరం ఉన్నవాళ్లు మాత్రమే..

హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలు ఫాం హౌస్‌లకు ప్రత్యేకం. మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, హిమాయత్‌సాగర్, జొన్నాడ, కొల్లూరు, మహారాజ్‌పేట వంటి ప్రాంతాల్లో గతంలో ఎకరం రూ.కోట్లలో ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు ఆ ధరలు పడిపోయాయి. కొన్నిచోట్ల కోట్లలో ఉన్న భూముల ధర లక్షల్లోకి పడిపోతున్నాయి. భవిష్యత్‌లో ఎలా ఉంటాయోనని రియల్టర్‌లతో పాటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు, ఇళ్లు అమ్మేవారితో పాటు కొనే వారు సైతం వేచి చూడాలన్న ధోరణిలో ముందుకెళుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News