Home కరీంనగర్ పక్కాగా భూసర్వే రికార్డులు

పక్కాగా భూసర్వే రికార్డులు

kmnr1

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్‌పి సింగ్
కరీంనగర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన భూ సర్వే రికార్డుల శుద్దీకరణ కార్యక్రమంలో రికార్డులు పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ సర్వే రికార్డుల శుద్దీకరణపై వీడి యో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత వరకు 3,500గ్రామాల్లో భూ సర్వే కార్యక్రమం పూర్తి అయిందని మిగిలిన గ్రామాలలో సర్వే పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ముందుగా స ర్వే టీంలు భూ సర్వే వివరాలను గ్రామాల వారీగా మాన్యు వల్‌గా తయారు చేసి గ్రామ సభలో చదివి వినిపించాల న్నారు. తరువాత గ్రామ సభ ఆమోదం మేరకు అన్ని వివ రాలు కంప్యూటరీకరించాలని తెలిపారు.
ప్రతి గ్రామాల వారిగా భూ సర్వే వివరాలను ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు అందజేస్తుందని ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పక్కాగా రికార్డులను నిర్వహించాలని సూచించారు. శాఖల వారీగా గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో ఉన్న భూ వివరాలను కూడా నమోదు చేయాల ని సూచించారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు ఎక్కువ భూమి బదలా యింపు జరుగుతుందని దానిని పక్కాగా రికార్డులో నమో దు చేయాలని సూచించారు. అలాగే రోడ్ల నిర్మాణానికి ఉ పయోగించిన భూమిని కూడా సర్వే నెంబర్లో చూపించా లని తెలిపారు. అటవీ భూములు వివరాలను కూడా సర్వే చేయాలని అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, అటవీ శాఖ మ ధ్యలో వ్యత్యాసం ఉంటుందని దాన్ని సరిచేయాలని సూ చించారు. ప్రభుత్వ భవనాలకు దాతలు విరాళంగా ఇచ్చిన భూమిని కూడా రికార్డులలో సంబంధిత శాఖ మీద మా ర్పులు చేర్పులు చేయాలని సూచించారు. భూ సర్వేను ని ర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.
ఈ వీడియో కాన్షరెన్సులో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మ ద్, జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, డిఆర్‌వో ఆయేషా మస్రత్ ఖానం, హుజురాబాద్ ఆర్డీవో చెన్నయ్య, కరీంన గర్‌ఇన్‌చార్జిఆర్‌డిఒపవన్‌కుమార్‌తదితరులు పాల్గొన్నారు.