Friday, April 19, 2024

మా భూమిమాగ్గావాలె..

- Advertisement -
- Advertisement -

Revanth brothers

 

దొంగ రిజిస్ట్రేషన్లతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ గోడ కట్టేశారు : బాధితులు దఫదఫాలుగా తప్పుడు పత్రాలు సృష్టించారు
గోడ పనులు అడ్డుకున్నందుకు దౌర్జన్యం చేశారు
న్యాయం చేయండి : మల్లయ్య కుటుంబం మొర
కొండల్ రెడ్డి తనకు సంబంధం లేని భూమికి మ్యుటేషన్ చేయించుకున్నాడు
మరి ఇద్దరు తహసీల్దార్ల పాత్ర ఉంది : రంగారెడ్డి కలెక్టర్

మన తెలంగాణ/హైదరాబాద్ : గోపన్‌పల్లి భూవివాదంలో రేవంత్ సోదరుల బాధితులు ఒక్కొక్కరుగా గళం ఎత్తుతున్నారు. కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్లతో, నిబంధనలకు విరుద్ధంగా సర్వే నెంబర్ 127లోని 6 ఎకరాల 24 గుంటల భూమిని తప్పుడు పత్రాలతో మ్యుటేషన్ చేసుకున్నారని ప్రభుత్వ విచారణలో బహిర్గతమైన విషయం తెలిసిందే. దీంతో తమకు సాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తిమ్మిని బమ్మిని చేసి కోట్ల రూపాయాల విలువైన తమ భూమిని కొట్టేసారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధం లేని వ్యక్తుల పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారని పేర్కొంటున్నారు. భూమి తమదేనంటూ 127 సర్వే నెంబర్‌కు చెందిన మల్లయ్య కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం 30 గుంటలు, 20 గుంటలు, ఎకరం అంటూ ఇలా దఫా దఫాలుగా తప్పుడు పత్రాలు సృష్టించారని బాధితులు వాపోతున్నారు.

తమకు తెలియకుండానే దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెబుతున్నారు. ఇదేంటని అడిగితే కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేసారని వాపోతున్నారు. అంతే కాకుండా తమ భూమిలోకి అక్రమంగా చొరబడి కంపౌండ్ వాల్ నిర్మించారని కన్నీరు మున్నీరవుతున్నారు. తమ భూమిలో గోడ పనులను అడ్డకుంటే తమపై దౌర్జాన్యానికి దిగారని, ఏం చేసుకుంటారో చేసుకోండని రేవంత్ సోదరులు బెదిరించారని దీనిపై కేసు కూడా నమోదైందని తెలిపారు. గోపన్‌పల్లిలో తమ భూమిని అక్రమంగా బదిలీ చేసుకోవడంతో పాటు రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, గంగాధర్ తమపై దౌర్జన్యం చేశారన్నారు. గోపన్‌పల్లిలో 127 సర్వే నెంబర్‌లో ఉన్న ఎస్‌సి మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నిర్మించిన రూమ్‌ను జెసిబితో కూల్చేసిన దానిపై ఎన్. పెద్దిరాజు చల్లాలు ఇచ్చిన ఫిర్యాదుపై కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డిలపై ఐపిసి 447, 427, 506లతో పాటు 2016 ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేసి చార్జిసీట్ కూడా దాఖలు చేశారు.

ఈ భూమి తనదేనని పెద్దిరాజు కూడా పేర్కొంటున్నారు. శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటులోనూ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని దీనిపై విచారణ జరపాలని రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి నుంచి సిబిఐకి ఫిర్యాదు కూడా అందింది. అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఎన్నికల ఆఫిడవిట్‌లోనూ తప్పుడు లెక్కలు చూపారని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొండల్ రెడ్డి సంబంధం లేని భూమిని మ్యుటేషన్ చేయించారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ భూవివాదంలో మరో ఇద్దరు తహసీల్దార్‌ల పాత్రను కూడా గుర్తించినట్లు తెలిపారు.

బెదిరించారు.. అక్రమ మ్యుటేషన్ చేసుకున్నారు : బాధితుడు
రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి మమల్ని మోసం చేసారు. అసలు ల్యాండ్ ఓనర్ లక్ష్మయ్య. మాకు తాతాల నుంచి రావాల్సిన భూమిని అక్రమ మ్యుటేషన్ ద్వారా తమ పైకి చేయించుకున్నారు. చాలా సార్లు భూమి కోసం రేవంత్, కొండల్ రెడ్డి దగ్గరకి వెళ్ళాము. మమల్ని బెదిరించి ఇబ్బందులకు గురి చేసారు. అప్పటి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డితో కుమ్మకై మోసానికి పాల్పడ్డారు. కోర్టులో కేసు ఉన్న సమయంలో మ్యుటేషన్ ఎలా చేస్తారు. ప్రభుత్వం న్యాయం చేయాలి.

Land victims comments on Revanth brothers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News