Home అంతర్జాతీయ వార్తలు విరిగి పడిన కొండచరియలు : 300 మంది సజీవ సమాధి

విరిగి పడిన కొండచరియలు : 300 మంది సజీవ సమాధి

LAND

పశ్చిమ ఆఫ్రికా : సియెర్రా లియోన్‌లో దారుణం చోటు చేసుకుంది. రాజధాని ఫ్రీటౌన్‌లో కొండచరియలు విరిగి పడి 300 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 600 వొందల మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బురదల్లో, మట్టి పెళ్లల కింద చిక్కుకపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 297 మృతదేహాలను వెలికి తీశారు. లియెర్రా లియోన్ అధ్యక్షుడు ఎర్నెస్ట్ బై కొరోమా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బుధవారం నుంచి ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ దేశంలో ఐక్యరాజ్యసమితి కూడా సహాయక చర్యలు చేపట్టింది.

Landslides broken: 300 People dead