Home ఆదిలాబాద్ నిగ్గు తేలుతున్న అక్రమాలు

నిగ్గు తేలుతున్న అక్రమాలు

Larger irregularities in the purchase of luggage

కందుల కొనుగోళ్ల అవకతవకలు వెలుగులోకి
పూర్తి అయిన విజిలెన్స్ దర్యాప్తు

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : జిల్లా వ్యాప్తంగా కందుల కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాల గుట్టు పూర్తిగా రట్టవుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కొనుగోళ్ల వ్యవహారాన్ని విజిలెన్స్‌కు అప్పజెప్పడంతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారులంతా కొనుగోల్‌మాల్‌లో పాత్రధారులుగా చేరుతున్నారు. గత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మార్క్‌ఫెడ్ సంస్థ జిల్లా వ్యాప్తంగా కందుల కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించింది. దాదాపు 17వేల మంది రైతుల నుంచి 2 లక్షల క్వింటాళ్లకు పైగా కందులను సంస్థ కొనుగోలు జరిపింది. అయితే జిల్లాలో మద్దతు ధర ఎక్కువగా ఉండడం పొరుగున ఉన్న మహారాష్ట్రలో కందుల ధర తక్కువగా ఉండడంతో కొంత మంది దళారులు అక్రమాలకు తెరా లేపారు. అయితే సదరు దళారులు మార్క్ ఫెడ్ అధికారులతో సిండికెట్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి కొంత మంది మార్కెటింగ్ అధికారులు, సిబ్బంది కూడా సహకరించరన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాపారులు వందల క్వింటాళ్ల కందులను మహారాష్ట్ర నుండి జిల్లాకు తరలించి రైతుల పేరిట మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో విక్రయించారు. అయితే అధికారులు, వ్యాపారులు సిండికెట్‌గా ఏర్పాడి ఈ కందుల రాకెట్‌ను ఇష్టానుసారంగా కొనసాగించారు. అయితే అధికారులు ఇంతా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికి పట్టించుకోలేదంటున్నారు. దాదాపు లక్షల రూపాయల్లో ఈ అవినీతి తతంగం జరిగినట్లు ఆరోపణలు అప్పట్లోనే వెలువెత్తాయి. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమంగా నిల్వ ఉంచిన కందుల గోదాములపై దాడులు జరిపించారు. ఈదాడుల్లో వెల క్వింటాళ్ల కందులు పట్టుబడ్డాయి. మొత్తం ఈ వ్యవహరం కూపిలాంగించిన కలెక్టర్ బాద్యులైన 11 మంది అధికారులు, సిబ్బందిపై కొద్ది రోజుల క్రితం వేటు వేశారు. అయితే కలెక్టర్ ఈ అక్రమాలపై పట్టువదలని రీతిలో విజిలెన్స్ విభాగానికి సైతం విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు కందుల విక్రయదారులపై లోతుగా విచారణ జరిపారు. బీనామీ రైతులపై ఆరా తీశారు. రైతుల ఖాతాల్లో జమ అయిన నిధులు, ఇతర వ్యవహరాలంటినిపై విలెన్స్ అధికారులు కూపిలాగారు. దీంతో మొత్తం గుట్టు రట్టైంది. గతంలో వేటుకు గురైన 11 మందితో పాటు మరో ఇద్దరిపై మళ్లీ వేటు వేసేందుకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి కందుల కొనుగోళ్ల అక్రమాలను తుడిపి పెట్టే వరకు జిల్లా కలెక్టర్ పట్టువదకుండా వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా ప్రసంశలు అందుకుంటుంది.