Friday, December 2, 2022

ఆసరా ఫించన్లకు గడువు వారం రోజులే

- Advertisement -

Last date for aasara pension apply by oct 31

 

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కొత్త ఆసరా ఫించన్లకు దరఖాస్తు గడువు వారం రోజులే ఉంది. ప్రభుత్వం వృద్దులకు వయస్సు సడలిస్తూ 57 సంవత్సరాల ఉన్నవారికి అందజేస్తామని ప్రకటన చేసి ఈనెల 31లోగా అర్హులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల చేసుకోవాలని సూచించడంతో ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. నగరానికి చెందిన పేద ప్రజలు పుట్టిన తేదీ, ఆధార్‌కార్డు, ఓటరు కార్డు, చిరునామా వంటి దృవపత్రాలతో నమోదు చేసుకుంటున్నారు. గతంలో వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పించడంతో చాలామంది ఫించన్ పొందేందుకు తంటాలు పడుతున్నారు. మొదటి దఫా ఆగస్టు 15 నుంచి 31వరకు 58, 650 వేల దరఖాస్తులు రాగా, ఈనెలలో 8,500 మంది దరఖాస్తులు చేసినట్లు, ఇంకా మరో 6వేల దరఖాస్తులు రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండోసారి అధికారం చేపట్టిన తరువాత వృద్దులు, వితంతులకు రూ. 2,116, వికలాంగులకు రూ.3116 అందజేస్తూ పేదల గుండెల్లో నిలిచిపోయారు. జిల్లాలో 1. 98లక్షల మంది తీసుకున్నట్లు, కొత్త వాటితో ఫించన్ల సంఖ్య 2.60 లక్షలకు చేరుకుంటుంది. నెలవారీగా రూ. 43 కోట్లు బడ్జెట్ విడుదల చేస్తుంది. తాజాగా ఆరునెలకితం వయస్సు కుదింపు చేసి అర్హులంతా దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు చేయడంతో చాలామంది సంబంధిత దృవీకరణ పత్రాలు తీసుకుని దరఖాస్తులు చేస్తున్నారు. గతంలో సమర్పించి వాటిని అధికారులు పరిశీలన చేస్తున్నట్లు, గడువులోగా అందిన దరఖాస్తులను నవంబర్ రెండో వారంలోగా పరిశీలన పూర్తి చేసి డిసెంబర్ నుంచి అర్హుల ఖాతాలో నగదు జమ చేస్తామని చెబుతున్నారు.

నిజమైన పేదలకు అందజేస్తామని, ధనవంతులకు అర్హులు కారని పేర్కొంటున్నారు. అదే విధంగా స్దానికంగా ఉండే కొంతమంది రాజకీయ దళారులు సొంత ఇళ్లు, స్దలాలు ఉన్న ఫించన్లు ఇప్పిస్తామని బస్తీలో ప్రచారం చేస్తున్నారని వారి మాటలు నమ్మవద్దని, ఆన్‌లైన్ దరఖాస్తే, తామే పూర్తిగా పరిశీలన చేస్తామని, సందేహం ఉంటే ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకుని మంజూరు చేస్తామని వెల్లడిస్తున్నారు. అదే విధంగా అన్హరులను, మరణించిన వారిని గుర్తించి వారి పేర్లు తొలగిస్తామంటున్నారు. మరణించిన వారి పేరు మీద కుటుంబ సభ్యులు నగదు డ్రా చేసుకుంటారని, వాటిపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయని, వివరాలు సేకరించి లబ్దిదారులకు మాత్రమే అందిస్తామని చెబుతున్నారు.

Last date for aasara pension apply by oct 31

Related Articles

- Advertisement -

Latest Articles