Home స్కోర్ సిరీస్ ఎవరిదో?!

సిరీస్ ఎవరిదో?!

 నేడు భారత్-ఇంగ్లాండ్ చివరి టి20
 ఇరుజట్లకు కీలకంగా మారిన మ్యాచ్

cricబెంగళూరు: ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిం చిన తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా ఇప్పటివరకు సొంత గడ్డపై విరాట్ కోహ్లి సిరీస్ కోల్పోలేదు. ప్రస్తుతం భార త్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో మా త్రం ఇరుజట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నా యి. ఫలితం తేల్చే చివరిదైన మూడో మ్యాచ్ బుధవారం బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ తన రికార్డును నిలబెట్టుకుం టా డా? టెస్, వన్డే సిరీస్ ఓటములకు ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మూ డు టీ20ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 ఆసక్తికరంగా సాగిం ది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠతను రేపిం ది. ఈ మ్యాచ్ టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజ యం సాధించింది. దీంతో రేపు జరిగే మ్యాచ్‌పైనే అంద రూ దృష్టి సారించారు. ఎలాగైనా టీ20లో విజయం సాధించి సిరీస్‌ను గెలుచు కోవాలని కోహ్లి నేతృత్వం లోని భారత జట్టు తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు టెస్టు, వన్డే సిరిస్ ఓటమి పరాభవాన్ని మరచిపోవాలంటే టీ20 సిరిస్‌ను గెలుచుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది.
ఒకటి గెలిస్తే, ఒకటి ఓటమి
ఇదిలాఉంటే ఇప్పటివరకు బెంగళూరు చిన్నస్వామి స్టేడి యంలో నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరిగా యి. అందులో టీమిండియా రెండు మ్యాచ్‌లు అడగా ఒకటి గెలవగా, మరొకటి ఓడింది. గతేడాది మార్చి 23న బంగ్లాతో భారత్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడిం ది. ఒక పరుగు తేడాతో టీమిండియా విజయం సాధిం చింది. 2012 డిసెంబర్ 25వ తేదీన పాకిస్తాన్‌తో జరిగిన ట్వంటీలో భారత్ 5 వికెట్ల తేడాతో భారత్ ఓట మి పాలైంది.
బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు?
రేపు జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌ను మారిస్తే అది జట్టుకు లాభిస్తుందని మాజీలు చెబుతున్నారు. ఇదే విష యాన్ని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రస్తావించాడు. రెండో మ్యాచ్‌లో గెలిచినా అది బౌలర్ల గొప్పదనమేనని, బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టుకు మంచిది కాదని అభిప్రా యపడ్డాడు. ‘ధోని ఇప్పుడు చాలా స్వేచ్ఛగా ఆడుతున్నా డు. అలాంటి సమయంలో కోహ్లి అతడిని సరిగ్గా ఉప యోగించుకుంటే జట్టు భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో కూడా ధోని సలహా తీసుకుంటే మంచిది’ అని కోహ్లికి సూచించాడు. అలాగే ‘రైనాను మూడో స్థానంలో బ్యా టింగ్ పంపడం వల్ల చివర్లో భారీ షాట్లు ఆడే ఆటగాడిని కోల్పోతున్నాం. మూడో స్థానంలో మనీష్‌పాండ్, ఆరో స్థానంలో రైనాను బ్యాటింగ్‌కు పంపిస్తే బాగుంటుంద న్నాడు.
జట్టులో మార్పులేమీ లేకుండానే..
రేపటి మ్యాచ్‌కు గత మ్యాచ్‌లోఆడిన తుది జట్టుతోనే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో భారత్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తుది జట్టులోకి వచ్చి ఫర్వాలేదనిపించాడు. అమిత్ మిశ్రా నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ కూ డా తీశాడు. దీంతో మిశ్రా స్థానానికి డోకా ఉండక పోవచ్చు. భారత్‌కు కీలక మ్యాచ్ కావడంతో ప్రయో గాలకు వెళ్లకుండా గత జట్టునే ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
జట్ల అంచనా:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), కెఎల్ రాహుల్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, పర్వేజ్ రసూల్, ఆశిష్ నెహ్రా, యుజవేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మ ణిదీప్ సింగ్, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా
ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, సామ్ బిలింగ్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, తైమాల్ మిల్స్, జోనాథన్ బెయిర్ స్టో, జేక్ బాల్, లియం డాసన్, డేవిడ్ విల్లీ
మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7 గంటలకు స్టార్ స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం