Home తాజా వార్తలు మొలకలకు ఊపిరి

మొలకలకు ఊపిరి

Rain

మన తెలంగాణ/హైదరాబాద్: . ప్రస్తుతం 12 జిల్లా ల్లో సాధారణ వర్షపాతం కురియగా, 21 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ, తెలంగాణ ప్రణాళికాభివృద్ధి  సొసైటీ విడుదల చేసిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ వారంలో వర్షాలు కురవాలని లేదంటే వేసుకున్న కొద్ది పంటలు దెబ్బతినడంతో పాటు, కొత్తగా స్వల్పకాలిక పంటలు వేసుకునే అవకాశం కూడా ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ పంటల విషయంలో రైతులు ఆసక్తి చూపడం లేదు.

ప్రత్యామ్నాయ పంటలివే..
జొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం, సజ్జ, రాగులు వంటి ఆరుతడి పంటలను, ఇతర పంటల స్వల్వకాలిక వంగడాలను మాత్రమే ఇక వేయాలని రైతులకు సూచిస్తూ వ్యవసాయ శాఖ, జయశంకర్ వర్సిటీ ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను విడుదల చేశాయి. సోయాచిక్కుడు, మినుము, పెసర, వేరుశనగ వంటి అనేక పంటల సాగుకు కాలం తీరింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇక వర్షాలు పడినా వాటిని వేయొద్దని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ తెలిపింది. వరిలో కూడా సాంబ మసూరి వంటి దీర్ఘకాలం సాగయ్యే విత్తనాలు వేయవద్దని సూచించారు.

Latest news and update on Rain In Telangana