Home ఆఫ్ బీట్ టాప్‌కు తగ్గ స్కర్ట్

టాప్‌కు తగ్గ స్కర్ట్

Skirt Designs

 

స్కర్టుల్లో చెప్పలేనన్ని రకాలొచ్చేశాయి. అయితే ఆ దుస్తుల్లో మరింత అందంగా కనిపించాలంటే నప్పే టాప్‌తో జత చేయాలి! ఏ స్కర్ట్‌కు ఎలాంటి టాప్ మ్యాచ్ అవుతుందంటే…

ప్రింటెడ్ నీ లెంగ్త్ : ముదురు రంగు ప్రింట్లు, గ్రాఫిక్ డిజైన్లు మోకాలి కిందవరకూ ఉండే స్కర్ట్‌లు ఎంచుకుంటే వాటికి తెల్లని టాప్ చక్కగా సూటవుతుంది. అయితే టాప్ స్లీవ్స్ పొడవుగా, ఉండి, మెడ దగ్గర స్లిట్ ఉండేలా చూసుకోవాలి. స్టయిల్‌గా కనిపించాలనుకుంటే స్లీవ్స్ చివర్లో ఫ్రిల్స్ ఉండాలి.

లాంగ్ స్కర్ట్ : పొడవాటి స్కర్ట్‌కు వీలైనంత చిన్న టాప్ ఎంచుకోవాలి. ఒకే రంగు స్కర్ట్‌కు గ్రాఫిక్ టీ షర్ట్ చక్కగా మ్యాచ్ అవుతుంది. షిఫాన్ స్కర్ట్ వేసుకుంటే వి నెక్, క్రాప్ టాప్స్ బాగుంటాయి.

మెటాలిక్ లేదా సీక్వెన్స్ స్కర్ట్: ఇలాంటి స్కర్ట్‌లు పార్టీల్లో బాగుంటాయి. వీటిని బ్లాక్ క్రాప్ టాప్‌తో మ్యాచ్ చేయాలి. స్కర్ట్ మెరుస్తూ ఉంటుంది కాబట్టి టాప్‌కు మెరుపులు జత చేయకూడదు. పూర్తి ప్లెయిన్ టాప్ అయితేనే ఎలిగెంట్‌గా ఉంటుంది. సో ట్రెండ్‌ను ఫాలో అయ్యే అమ్మాయిలకు ఇదో శుభవార్తన్నమాట.

Latest Skirt Designs For Women