Sunday, June 22, 2025

గిరిజనుల కోసం మరో పథకం: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు గాలికి వదిలేసిందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. గిరిజనుల భూమికి సాగునీటి కోసం ఇందిరా గాంధీ సౌర గిరిజల అనే పథకాన్ని చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా  తెలంగాణ కాంగ్రెస్ బునియాది ఆదివాసి కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఇందిరా సౌర గిరిజల పథకానికి రూ. 12,500 కోట్లు కేటాయించామని, 2013 లో ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ ను తీసుకువచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గిరిజనుల కోసం ఇటీవల మరో పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) చేపట్టిందన్నారు. పదేళ్ల పాటు ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ కు నిధులు ఇవ్వలేదని, ఉన్నవి ఖర్చు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సి సబ్ ప్లాన్ కు రూ.17, 169 కోట్లు కేటాయించిందని, కాంగ్రెస్ చేపట్టిన పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భట్టి విక్రమార్క సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News