Wednesday, April 24, 2024

రేపటి నుంచి లాసెట్‌ కౌన్సె‌లింగ్‌

- Advertisement -
- Advertisement -

LAWcet counseling from tomorrow

 

హైద‌రా‌బాద్: లా కాలే‌జీల్లో సీట్ల భర్తీకి సోమ‌వారం నుంచి అడ్మి‌షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు ఆన్‌‌లైన్‌ రిజి‌స్ట్రేషన్లు, ఆన్‌‌లైన్‌ పేమెంట్‌ ప్రక్రియ కొన‌సా‌గ‌ను‌న్నది. ఈ నెల 19 నుంచి 22 వరకు స్పెషల్‌ క్యాట‌గిరీ వారు నేరుగా కౌన్సె‌లింగ్‌ కేంద్రా‌లకు హాజరు కావాల్సి ఉంటుందని అడ్మి‌షన్‌ కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ జీబీ‌రెడ్డి తెలి‌పారు. కౌన్సె‌లిం‌గ్‌‌కోసం రిజి‌స్టర్‌ చేసు‌కున్న విద్యా‌ర్థుల జాబి‌తాను 24న విడు‌దల చేస్తారు. 26, 27 తేదీల్లో తొలి విడుత వెబ్‌‌ఆ‌ప్షన్ల నమోదు కొన‌సా‌గ‌ను‌న్నది. 28న ఎడిట్‌ ఆప్షన్‌, 29న సీట్లు కేటా‌యి‌స్తారు. సీట్లు పొందిన విద్యా‌ర్థులు 31 వరకు కాలే‌జీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. వివ‌రాలకు https://lawcet.tsche.ac.in వెబ్‌‌సై‌ట్‌ను సంప్రదించా‌ల‌న్నారు. లాసెట్, పిజిఎల్‌సెట్ పరీక్షలకు మొత్తం 30,310 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 21,520 మంది పరీక్షకు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News