Tuesday, September 17, 2024

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

LB Nagar court sentenced man to life imprisonment

తీర్పు చెప్పిన ఎల్‌బి నగర్ కోర్టు

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…. షాబాద్ మండలం, తిమ్మారెడ్డి గూడ గ్రామానికి చెందిన ఎరుకల అలియాస్ జాగరి కృష్ణ అలియాస్ కిష్టయ్య కూలీ పనిచేస్తున్నాడు. యాదమ్మను వివాహం చేసుకోగా వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యాదమ్మను కృష్ణ హత్య చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితుడు అంజమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె అనారోగ్యంతో జనవరి, 2017లో మృతిచెందింది. కృష్ణ ఇద్దరు కుమార్తెలతో గుడిసెలో ఉంటున్నాడు.

ఒక రోజు నిందితుడు బాలిక చేతిని పట్టుకుని అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో గొడ్డలి చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి బాలికను బెదిరించి తరచూ అత్యాచారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపులో నొప్పి రావడంతో తన చిన్నమ్మకు చెప్పింది. ఆమె బాలికను ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయించగా గర్భవతిగా తెలిసింది. వెంటనే బాలికను నిలదీయగా తండ్రి తనపై చేస్తున్న అత్యాచారం గురించి చెప్పింది. వెంటనే బాధితురాలిని తీసుకుని పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న షాబాద్ ఇన్స్‌స్పెక్టర్ దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కోర్టులో సాక్షాలు ప్రవేశపెట్టగా పరిశీలించిన ఎల్‌బి నగర్ కోర్టు నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News