Saturday, April 20, 2024

ఇక ట్రాఫిక్ ఫ్రీగా ఎల్‌బినగర్ జంక్షన్

- Advertisement -
- Advertisement -

ktr

హైదరాబాద్: ఉప్పల్, ఎల్‌బినగర్ ప్రాంత వాసులకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. గురువారం మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారకరామరావు చేతుల మీదుగా కామినేని జంక్షన్ వద్ద గల ఉప్పల్, ఎల్‌బినగర్ ఫ్లైఓవర్, ఎల్‌బినగర్ అండర్‌పాస్‌లు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. రూ.448 కోట్ల విలువగల ఉండగా వాటిలో ఫ్లై ఓవర్ కాస్ట్ రూ. 43 కోట్లు ఉందన్నారు. 2018 ఆగస్టు 18న ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2020 మే 25 నాటికి పూర్తయినట్లు తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే 89 శాతం ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గం లభించడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు.

ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి వోవైసీ, శ్రీశైలం వెళ్ళే వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణించే వచ్చు. ఇప్పటికే కామినేని మీదుగా సాగర్ రోడ్‌లోకి వెళ్ళే ప్రయాణికులకు రైట్ సైడ్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి చౌరస్తాల వద్ద ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా వాహనదారులు తమ పనులు సులువుగా చేసుకోగలుగుతున్నారు. ఎల్‌బినగర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ ఏర్పడక ముందు నిత్యం వాహన రద్దీ ఉండటమే కాకుండా ఆ ప్రాంత మంతా సౌండ్ పొల్యుషన్‌తోపాటు వాతావరణ కాలుష్యం ఏర్పడేది.

ముఖ్యంగా దిల్‌షుక్‌నగర్, ఎల్‌బినగర్ ప్రాంతాల వాసులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో ఈ అంశంపై జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్ట్టి పక్కా ప్రణాళికతో సుమారు సంవత్సరంన్నర కిత్రమే దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఆ మార్గం గుండా వెళ్ళే ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యలకు కూడా మోక్షం లభించింది.

అయితే గురువారం మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఫ్లై ఓవర్, అండర్‌పాస్‌లతో ఎల్‌బినర్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వారికి కాని, అదే విధంగా దిల్‌షుక్‌నగర్ మీదుగా ఎల్‌బినగర్ విజయవాడ వెళ్ళే ప్రయాణికుల ట్రాఫిక్ సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పడింది. ఎప్పడు ట్రాఫిక్ సమస్యలతో గజిబిజిగా ఉండే ఎల్‌బినగర్ జంక్షన్ ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్ మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. లాక్‌డౌన్ సమయంలో అధికారులు సంబంధిత పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణీత కాలంలోనే పూర్తి చేసినట్లు తెలిపారు.

LB nagar Junction as traffic free

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News