Home రాష్ట్ర వార్తలు ఇతర పార్టీల నాయకులు వస్తామంటున్నారు

ఇతర పార్టీల నాయకులు వస్తామంటున్నారు

త్వరలో వారిని టిడిపిలో చేర్చుకుందాం
రాష్ట్ర పార్టీ నేతలతో భేటీలో చంద్రబాబు

Chadra-babuహైదరాబాద్ : టిడిపిలో చేరేందుకు తెలంగాణలోని ఇతర పార్టీల నాయకులు కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారని, త్వరలో వారిని పార్టీలో చేర్చుకుందామని టిడిపి జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సిఎ ఎన్. చంద్రబాబు నాయుడు  అన్నారు. హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్, బుద్ధవిగ్ర హం, హెఐసిసి, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్, మెట్రో వంటి పను లు టిడిపి ప్రారంభించినవి, పూర్తి చేసినవి ఉన్నాయన్నారు. హెఐసిసిలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమావేశం సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ సలహాదారు ఇవాంకాతో పాటు వచ్చిన జిఇఎస్ ప్రతినిధులందరూ టిడిపి వేసిన రోడ్లపైనే తిరిగారన్నారు.వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ ఎన్‌టిఆర్ వర్ధంతి నుంచి మార్చి 29 పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు 70 రోజులు పల్లె పల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. నాడు టిడిపి ప్రభుత్వం చేసిన పనులే ఇప్పటికీ కన్పిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్‌టిఆర్ భవన్‌లో శుక్రవారం జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఎపి సిఎం ఎన్. చంద్రబాబు నాయుడు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, అనుంబంధ సంఘాల అధ్యక్షుల తో సమావేశమయ్యారు. రాష్ర్టంలో టిడిపిని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలను తీసుకొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పల్లెపల్లెకు టిడిపిలో భాగంగా టిడిపి ప్రభుత్వ హయాంలోనిఅభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి జనవరి 17 వరకు ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ టిడిపి నేతలను ఆదేశించారు. ప్రతి గురువారం ఉదయం 8 గుంటల నుంచి 9 గుంటల వర కు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటానని, నెలకొకసారి పార్టీ చేసిన కార్యక్రమాలను సమీక్ష చేస్తానని, పార్టీ అభివృద్ధి కోసం పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పార్టీ నాయకులు ప్రతిరోజు ఎన్‌టిఆర్ భవన్‌కు రావాలని ఆదేశించారు. విభజన వంటి క్లిష్ట సమయంలో కూడా 2014 ఎన్నికలలో టిడిపి రాష్ట్రంలో 22 శాతం ఓట్లు వచ్చాయన్నారు. అన్ని కమిటీలను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలకు సంఘీభావం తెలుపుతూ సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నెలరోజుల్లో ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ ల నియామకం, జిల్లా అధ్యక్ష పదవులు, లోకసభ నియోజకవర్గలకు ఇంచార్జ్‌ల నియామకం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి 40మంది సీనియర్ నాయకులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో అక్కడకు వెళ్లి గాయపడిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన నరేందర్ గౌడ్‌ను అభినందించి, ధైర్యం చెప్పారు.
ఇక దృష్టంతా తెలంగాణపైనే: మూడున్నరేళ్లలో ఎపిలో చేయాల్సిన పనులన్నీ చేసామని, వచ్చే ఎన్నికల్లో అక్కడ అధికారంలో తప్పకుండా వస్తామని నేతలతో చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మిగిలిన ఏడాదిన్నర తెలంగాణపైనే దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.
ఉమామాధవ రెడ్డి డుమ్మా ఒంటేరును..
చంద్రబాబుతో సమావేశానికి పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమామాధవరెడ్డి హాజరు కాలేదు. ఆమె టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీలో చేరుతారని టిడిపి నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇటీవల ఒయూలో ఆత్మహత్య చేసుకున్న మురళీ మృతదేహాన్ని చూసేందుకు యూనివర్సిటీకి వెళ్లి అరెస్టైన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పట్టించుకోకపోవడంపై పార్టీ నేతలపై చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం చే యరు, చేసే వారికి అండగా నిలబడరు ఇలాగైతే పార్టీ ఎలా ముందుకు వె ళ్తుందని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒంటేరును ఎక్కడ ఉన్నా రో కనుక్కొని సమావేశానికి రమ్మని చెప్పాలని ఆదేశించారు. అయితే ప్ర తాప్‌రెడ్డి ఫోన్‌లో అందుబాటులోకి రాలేదని తెలిసింది.