Home తాజా వార్తలు మేమూ బట్టలు ఉతకగలం….(వీడియో)

మేమూ బట్టలు ఉతకగలం….(వీడియో)

Monkey

హైదరాబాద్: మనుషులే కాదు తాము బట్టలు ఉతకగలము అంటూ ఓ కోతి బట్టలను ఉతికి ఆరేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు బట్టలు ఉతకడమే తెలియదు. వాషింగ్ మెషిన్‌లో వేస్తే చాలు  అవే ఉతికి పెడుతున్నాయి. కోతి బట్టలకు సబ్బు పెట్టి అనంతరం ఉతికి ఆరేసింది. దీంతో బట్టలు ఉతికిన కోతి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సుశాంతా నంద అనే ఐపిఎస్ ఆఫీసర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. కోతిని చూసి బట్టలు ఉతకడం నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేశారు.

 

Learning to do from seeing primate is extremely amusing

  

Monkey Wash Dresses (Video Viral in Social Media)