Home అంతర్జాతీయ వార్తలు బుర్కినా ఫాసో చర్చి వద్ద కాల్పులు.. 24 మంది మృతి

బుర్కినా ఫాసో చర్చి వద్ద కాల్పులు.. 24 మంది మృతి

Burkina Faso

వోగాడొగౌవ్ (పశ్చిమ ఆఫ్రికా) : బుర్కినా ఫాసోలో ఆదివారం కొందరు దుండగులు ఒక చర్చి వద్ద జరిపిన కాల్పుల్లో పాస్టర్‌తో సహా 24 మంది మరణించారు. ముగ్గురిని కిడ్నాప్ చేశారని అధికారులు తెలిపారు. అస్థిర పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పశ్చిమాఫ్రికా దేశంలో ఒక మత నాయకుడిని లక్షంగా చేసుకొని తాజాగా జరిపిన దాడి ఇది. బౌండోర్ కమ్యూన్ మేయర్ సిహాన్రి ఒసంగోలా బ్రిగాడీ దాడి గురించి మాట్లాడుతూ ‘యాఘా ప్రావిన్స్‌లోని పాన్సీ టౌన్‌లో ఈ దాడి జరిగింది.

ప్రొటెస్టెంట్ చర్చికి ఆనుకొని ఉన్న ప్రదేశంలో ఉన్నవారిలో మహిళల్ని పక్కకు తప్పుకోమని దాదాపు 20 మంది దాడిచేశారు. ఈ సంఘటనలో పదిమంది గాయపడ్డారు’ అన్నారు. సంఘటనా స్థలానికి 110 మైళ్ల దూరంలో ఉన్న డోరీ టౌన్ ఆస్పత్రిలో గాయపడిన వారిని చేర్చారు. ‘నేను వారిని చూసి చాలా బాధపడ్డాను’ అని మేయర్ తెలిపారు. తుపాకులతో వచ్చిన వారు షాపుల నుంచి చమురు, బియ్యం లూటీ చేశారు. చర్చిని దగ్ధం చేసేముందు క్రిస్టియన్లు, ముస్లింలను చంపేశారని డోరీలో ప్రభుత్వ భద్రతాధికారి ఒకరు చెప్పారు.

Least 24 killed in mass shooting at Burkina Faso church