Wednesday, March 22, 2023

9న 44వ డివిజన్‌లోని ఉద్యోగులకు సెలవు

- Advertisement -

amrapali

* జిల్లా కలెక్టర్ అమ్రపాలి

మన తెలంగాణ/వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్‌కు జనవరి 9 మంగళవారం ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఈ డివిజన్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రోజున జరిగే ఎన్నికల్లో 44వ డివిజన్‌లో నివాసం ఉంటూ ఆడివిజన్‌లో ఓటర్లుగా నమోదు అయిన ఉద్యోగులు మాత్రమే సెలవు తీసుకొని  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అంతేకాకుండా 9వ తేదీన వారికి సెలవు ఇస్తున్నందున ఆరోజుకు బదులు మరొక రోజు ప్రభుత్వ సెలవు రోజున ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుందని కూడా జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అలాగే ఉప ఎన్నిక కోసం పోలింగ్ బూతులుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలకు కూడా 9న సెలవుగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News