Friday, March 29, 2024

అనుమతి లేకుండా ధర్నాలు, నిరసనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వరంగల్‌క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇకపై రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు కాని ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు నిర్వహించాలనుకుంటే పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని, అలాకాకుండా ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు, వాహనదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా చట్టవిరుద్ధంగా ఆకస్మికంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు పాల్గొనే వ్యక్తులపై చట్ట పరంగా కేసులను నమోదు చేసి తగు చర్యలు తీసుకోబడుతాయని సిపి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే న్యాయపరంగా అధికారుల దృష్టికి తీసుకుపోవాలని సిపి ప్రజలకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News