Home తాజా వార్తలు ఆవుపై చిరుత దాడి

ఆవుపై చిరుత దాడి

Cow

 

నల్లగొండ: ఆవుపై చిరుత దాడి చేసిన సంఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచల్ల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దేవరచల్ల గ్రామ శివారులో ఆదివారం రాత్రి బావి దగ్గర చెట్టుకు కట్టేసి ఉన్న ఆవుపై చిరుతపులి దాడి చేసింది. దీంతో రైతు పొలం దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆవుపై చిరుత దాడి చేసిందని స్థానిక గ్రామస్థులకు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తుందో అని ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తుందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Leopard Attack on Cow in Chandampet in Nalgonda