Tuesday, March 28, 2023

వికారాబాద్ లో చిరుత దాడి….

- Advertisement -

Leopard attack on Goats in Vikarabad

 

కులకచర్ల: వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని చిరుతపులి సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి చెరువు మందలి తండాలోని కేతావత్ లాల్య మేకల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు మేకలు చనిపోయాయి. అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరకొని చిరుతను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మెదక్ జిల్లాలోని హవేలిఘనపూర్ మండలం బొగుడభూపతిపూర్‌లో చిరుత దాడిలో రెండు మేకలు చనిపోయాయి. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News