Home జాతీయ వార్తలు కాపలా కుక్కపై చిరుత దాడి.. (వీడియో)

కాపలా కుక్కపై చిరుత దాడి.. (వీడియో)

Leopard

 

గుజరాత్ : పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసిన సంఘటన గుజరాత్ లోని అమ్రేలిలో చోటుచేసుకుంది. పెంపుడు కుక్క తన యజమాని ఇంటి ముందు మెట్ల వద్ద నిద్రపోతుంది. ఇంతలో ఓ చిరుత మెల్లగా ఆ ఇంటి గుమ్మంవైపు వచ్చింది. ఎలాంటి శబ్దం చేయకుండా చిరుత జాగ్రత్తగా కుక్క దగ్గరగా వచ్చి దాని పీకను పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోనే కుక్క అప్రమత్తమైంది.

తన పీక కొరికేందుకు యత్నించిన చిరుతకు కుక్క ఝళక్కిచ్చి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కుక్క పారిపోయిన తర్వాత వీడియో పుటేజీ లేకపోవడంతో.. ఇంతకీ ఆ కుక్క బ్రతికుందా.. చిరుత చేతిలో చిక్కుకుందా అనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలెట్టారు. వీడియోను చూస్తుంటే మొత్తానికి ఆ కుక్క చిరుతకు చిక్కలేదనే విషయం అర్థమవుతోంది.

Leopard attack on guard Dog