Friday, March 29, 2024

మెదక్ జిల్లాలో బోనులో చిక్కిన చిరుత..

- Advertisement -
- Advertisement -

Leopard caught by Forest Officers in Medak

మెదక్: జిల్లాలో చిన్న శంకరం పేట మండలంలోని కామారం తాండ, నెమల్ల గుట్ట వద్ద చిరుత పులి అటవి అధికారులకు చిక్కింది. కామారం తాండ సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ పశువులపై చిరుత దాడి చేస్తుండటంతో భయబ్రాంతులకు గురైన తాండ వాసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ అధికారులు తాండకు వెళ్లి చిరుత కోసం బోను ఏర్పాటు చేశారు. దీంతో శనివారం రాత్రి చిరుత బోనులో చిక్కింది. చిరుత చిక్కడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. చిరుత చిక్కిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ చందనాదీప్తి పరిశీలించారు. చిరుతను అడవిలో వదిలేయాలా లేదంటే జూకు తరలించాలా నే విషయంలో అధికారులు ఆలోచిస్తున్నారు.

Leopard caught by Forest Officers in Medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News