Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తూర్పుగోదావరిలో చిరుతపులి బీభత్సం

తూర్పుగోదావరిలో చిరుతపులి బీభత్సం

Leopardతూర్పుగోదావరి : ఆత్రేయపురం మండలంలో ఓ చిరుతపులి బీభత్సం సృష్టించింది. దీంతో మండల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అంకంపాలెం అనే గ్రామంలో సోమవారం రాత్రి పులి కొబ్బరి చెట్టు ఎక్కింది. చెట్టుపై నుంచి దిగి వలలోకి రాకుండా పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. చిరుతను పట్టుకోవడంలో అటవీశాఖ అధికారులు విఫలం చెందారని ఆరోపిస్తూ ఆ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. అంకంపాలెంలో సోమవారం రాత్రి చిరుతపులి నలుగురిపై దాడి చేసి గాయపర్చింది.  ప్రజలు కర్రలతో దాడికి దిగారు. దీంతో ఆ చిరుత మొదట మామిడి చెట్టు ఎక్కింది. దానిపై నుంచి నెమ్మదిగా పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపైకి వెళ్లింది. చిరుపులి సంచారంపై గ్రామ ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను బంధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గ్రామ ప్రజలను చూసిన చిరుతపులి భయంతో కొబ్బరి చెట్టు దిగి పంట పొలాల్లోకి వెళ్లింది. చిరుతపులిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని ఆ గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

Leopard Hulchul at East Godavari