Home తాజా వార్తలు సంగారెడ్డిలో చిరుత కలకలం..

సంగారెడ్డిలో చిరుత కలకలం..

Leopard spotted in Sangareddy

సంగారెడ్డి: జిల్లాలోని కల్లేరు మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని నగాధర్ శివారులో ఓ లేగదూడపై చిరుత దాడి చేసింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. చిరుతను పట్టుకోవడానికి రంగంలోనికి దిగిన అటవీ శాఖ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Leopard spotted in Sangareddy