Saturday, April 20, 2024

కనకగిరి అడవుల్లో చిరుత పులి సంచారం

- Advertisement -
- Advertisement -

Leopard wandering in kanakagiri reserve forest

చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గ్రామ శివారు కనకగిరి అటవీ ప్రాతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తల్లాడ పారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో చిరుత పులి సంచరించిన దృశ్యాలు నమోదైయ్యాయి. అని తల్లాడ రేంజ్ అధికారి అరవింద్ దృవీకరించారు. కనకగిరి గుట్టలు ఇటు చండ్రుగొండ, జూలూరుపాడు మండలాలతో పాటు ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి, కల్లూరు, ఏన్కూరు, తల్లాడ మండలాల మధ్య విస్తారించి ఉన్నాయి ఇటీవల కాలంగా చిరుత సంచరిస్తున్న అనవాళ్ళు ఉన్నట్లు ఆదివాసీలు సైతం చెప్తున్నారు. చిరుత సంచరిస్తున్న క్రమంలో పశువుల కాపరులు, ఇతర పనుల కోసం అటవీకి వెళ్ళెవారు, పరిసార ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ ఆధికారులు సూచించారు.

Leopard wandering in kanakagiri reserve forest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News