Home తాజా వార్తలు మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుతపులి సంచారం

మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుతపులి సంచారం

Leopard Wandering In Manjira River Basinనిజామాబాద్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చిరుతపులి సంచరిస్తుండడంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందని స్థానికులు తెలిపారు. పక్షం రోజుల క్రితం బీర్కుర్ మండలంలో చిరుతపులి సంచరించింది. ఈ క్రమంలో చిరుతపులి పశువులపై దాడిచేసింది. చిరుతపులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది బోనును ఏర్పాటు చేశారు. కానీ తప్పించుకుని తిరుగుతున్న చిరుతపులి రోజుకో చోట సంచరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి మంజీరా నది తీరంలో చిరుతపులి కనిపించింది. వెంటనే ఈ చిరుతపులిని బంధించాలని అటవీశాఖ అధికారులను స్థాని ప్రజలు కోరుతున్నారు.