Home తాజా వార్తలు వికారాబాద్ లో చిరుత సంచారం

వికారాబాద్ లో చిరుత సంచారం

Leopard wandering in Vikarabadవికారాబాద్ : వికారాబాద్ లో చిరుత సంచరిస్తోంది.  జిల్లాలోని కులకచర్ల మండల పరిధిలోని చెర్వుముందలి తండాలో చిరుత కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన శంకర్ అనే  రైతు కు చెందిన పశువులపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ఓ ఆవు చనిపోయింది. చిరుత ఆనవాళ్లను గుర్తించిన శంకర్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఒంటరిగా ప్రజలు పంట పొలాల వద్దకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.