Thursday, April 25, 2024

తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం

- Advertisement -
- Advertisement -

Leopard

 

తిరుమల ప్రతినిధి : నిరంతరం భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించాయి. సోమవారం ఉదయం కాలినడకన తిరుమలకు వెళుతున్న భక్తులు 250వ మెట్టు వద్ద జింక పిల్లను చిరుత చంపి తిన్నట్లు ఆనవాళ్ళు గుర్తించారు. వెంటనే పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులకు సమాచారం అందించారు. వ్యాపారులు అందించిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. విజిలెన్స్, అటవీ సిబ్బంది చిరుత చంపి తిని వదిలేసిన జింక కళేబరాన్ని శ్రీవారి మెట్టు మార్గంలో నుంచి జూ పార్కు కు తరలించారు. చిరుత సంచారం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఉదయం పూట 6:45 నిమిషాలకు తరువాత భక్తులను అనుమతించాలా టిటిడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Leopard Wandering on Thirumala Walkway
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News