Home జిల్లాలు ఆకుపచ్చ తెలంగాణ చేద్దాం

ఆకుపచ్చ తెలంగాణ చేద్దాం

collcter– భారీ మెగా హరితహారం ర్యాలీ
– స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు, సంఘాలు
– మహిళలు తలచుకుంటే అన్నీ సాధ్యమే
– అగ్రికల్చరల్ డే మార్పు
– సర్పంచ్‌లకు ప్రశంసలు..
– కలెక్టర్‌కు మంత్రి ప్రశంసలు
-రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
మనతెలంగాణ/ఇందూరు: పచ్చని చెట్లు మనిషి మనుగ డకు జీవనాధారం.. అటువంటి చెట్లను పరిరక్షించుకోవా లి…వన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌ రుడి ప్రథమ కర్తవ్యం.. ప్రతి వ్యక్తి కనీసం 12 మొక్కలు నా టి ఆకుపచ్చ తెలంగాణకు తోడ్పడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలపునిచ్చారు. సోమ వారం నిర్వహించిన ‘మెగా హరితహారం’ కార్యక్రమాన్ని మంత్రి పోచారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద హరి తహారం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో వందలాది మంది వివిద పాఠశాలలకు చెందిన విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, వివిధ స్వచ్చంద సంస్థ లకు చెందిన కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, డ్వాక్రా, మ హిళా సంఘాల సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంత రం ఐటీఐ మహిళల కళాశాలలో మంత్రి పోచారం, మేయ ర్ సుజాత, ఎమ్మెల్యే బిగాల, కలెక్టర్ యోగితారాణా, కమి షనర్ నాగేశ్వర్ మొక్కలను నాటారు.
అనంతరం ఎమ్మెల్యే బిగాల గణేష్ అధ్యక్షతన జరిగిన సభ లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. చెట్ల మొక్క ప్రాధాన్యాన్ని విడమరచి చెప్పారు. మనిషి పుట్టిన ప్పటి నుంచి మరణించే వరకు చెట్లు పాత్రను విడమరచి చెప్పారు. చెట్లు లేకపోతే మనిషి మనుగడ లేదన్నారు. చెట్లు లేకపోతే బతకడం కష్ట మన్నారు. చెట్లు లేని దేశాల్లో మనిషి ఆక్సిజన్ సిలెండర్లు పెట్టుకుని జీవించే దుర్భర జీవితం ఏ ర్పడుతుందన్నారు. చెట్లు పెట్టే కార్యక్రమం జిల్లాలో జోరు గా సాగుతుందని కితాబిచ్చారు.
చెట్లు ఉంటేనే వర్షాలు…
రాష్ట్రంలో అడవులు అధికంగా ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు చాలా విస్తారంగా కురుస్తున్నాయని తెలి పారు. అడవులు అంతరించిపోయిన నిజామాబాద్, మెద క్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో వర్షాల జాడ లేద ని గుర్తుచేశారు. పరిసరాలు పచ్చదనంతో ఉండి చెట్లు విరి విగా ఉంటేనే వర్షాలు విస్తారంగా పడతాయని తెలిపారు. చెట్లు ఉన్నచోటనే వర్షాలుబాగా పడుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. చెట్లు లేక పోతే వారానికి ఒకసారి స్నానం చేసే దుర్భర పరిస్థితులు రా వడానికి ఎన్నో రోజులు లేవన్నారు. వర్షాలు లేక కరువు, కా టవాలు ఏర్పడితే బంగారం, డబ్బు తినలేం కదా అని విద్యా ర్థులకు అర్థమయ్యేవిధంగా చెట్ల యొక్క ప్రాదాన్యాన్ని వివరి ంచారు. వర్షాలు పడితేనే రైతులు సాగు చేస్తారు, తద్వారా పం టలు పండుతాయి, దాని వల్లనే మనిషి తినే తిండి దొరుకు తుందని గుర్తుచేశారు.
సాగుకు లేకుండా తాగడానికి నీరు
బాన్సువాడ, బోదన్ మండలాల రైతులు తమ పొలాలు సాగు చేయకుండా ఆపివేయడం వల్లనే నిజామాబాద్ నగరవాసులు దాహార్తిని తీర్చిన విషయం గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో నిజాం సాగర్‌లో 365 రోజులు నీటితో నిల్వ ఉండిన పరిస్థితి గుర్తుం చుకోవాలన్నారు.ఇప్పుడు వర్షాలు సరిగా పడకపోవడం వల్ల తొలిసారి నిజాం సాగర్‌లో నీరు ఎండిపోయిన పరిస్థితి వ చ్చిందన్నారు.
లక్షం పూర్తిచేస్తాం
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 46 కోట్ల మొక్కలు నా టాలని సిఎం కెసిర్ టార్గెట్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల మొక్కలు నాటాలని ల క్షంగా పెట్టుకున్నారని, ఇప్పటి వరకు 1.29 లక్షల చెట్లు నాటారని గుర్తుచేశారు.
కలెక్టర్‌కు ప్రశంస
కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఎక్కడో పుట్టి ఉద్యోగరీత్యా ని జామాబాద్‌లో కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పటికీ హరిత హారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారని ప్రశంసించారు. హ రితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు విజయవతం చేయడానికి రేయింబవ ళ్లు శ్రమిస్తున్నారని, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాన ని సభావేదికపై అభినందించారు. మహిళలు తలచుకుంటే సా ధించలేనిది ఏమీ లేదన్నారు.
సర్పంచ్‌లకు ప్రశంసలు
గ్రామ పంచాయతీలో 4 వేల మొక్కలు నాటాలని లక్షం ని ర్ధేశించామని, అందులో దాదాపు 12 గ్రామ పంచాయతీల్లో ఒ కే రోజు 4వేల మొక్కలు నాటి ఇతర గ్రామాల వారికి ఆదర్శ ంగా నిలిచారని, అటువంటి వారిని అభినందించాలని కలెక్టర్ మంత్రి పోచారంను కోరారు. కలెక్టర్ కోరిక మేరకు భీంగల్, రాజ్‌పల్లి, వడిపల్లి, చంద్రాయన్‌పల్లి, వెల్మల్, పెంటకలాన్, బె ల్లాల్ ఫారం, బీబీపేట్, పాతరాలపేట, దూస్‌గాం గ్రామ పం చాయతీ సర్పంచ్‌లకు మెమోంటోలు అందజేశారు. అందులో అదికంగా మహిళలే ఉండటంతో మహిళలను అభినందించా రు. మహిళలు తలచుకుంటే సాద్యం కానిదేదీ లేదన్నారు.
విద్యార్థులతో ప్రతిజ్ఞ
ప్రతి ఒక్క విద్యార్థి కనీసం 12 మొక్కలు పెంచుతామని, హరిత తెలంగాణకు ప్రతి ఒక్కరు పాటుపడతామని, తమతో పాటు తోటివారితో సైతం మొక్కలు నాటిస్తామని, పెట్టిన ప్రతి మొ క్కను రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈనెల 19న అంటే సోమవారం జరుపుకోనున్న ‘అగ్రికల్చరల్ డే’ను మొ క్కలు అందుబాటులో లేనందున ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు మంత్రి పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జెసి రవీందర్ రె డ్డి, ఆర్డీవో యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్, అడిషనల్ కమిషనర్ పి.విశ్వనాథ, డిప్యూటీ కమిషనర్ లిం బాద్రి, డిప్యూటీ మేయర్ ఎంఎఫహీం, కార్పొరేటర్లు కడారి శ్రీ వాణి, విశాలిని రెడ్డి, అపర్ణ, గంగమణి, సుదాం లక్ష్మి, చాంగు బాయి, మాదురి, దారం సాయిలు, మాయావర్ సాయిరాం, మురళి, పోతుల పురుషోత్తం, పంచరెడ్డి సురేష్, ఎస్‌ఈ సరోజి ని దేవి, ఎంహెచ్ డాక్టర్ సిరాజుద్దీన్, ఎంఈ వెంకటేశ్వర్లు, డీ ఈవో లింగయ్య, ఏఈలు రషీద్, సుదర్శన్ రెడ్డి, ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు.
బీర్కూర్‌లో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కా ర్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీర్కూర్ శివా రులో గల తెలంగాణ తిరుమల ఆలయంలో సోమవారం ఆ యన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీఎఫ్‌వో సుజాతతో కలిసి ఆలయం ఆవరణలో గంధపు చెట్లను ఆయన నాటారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరిత హారం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని, వాడవాడల్లో, గ్రామాల్లో హరిత హారం కార్యక్రమానికి విపరీత మైన స్పందన వస్తుందని, రైతులు, వ్యాపార వేత్తలు, ఉపాధ్యా యులు చెట్లు నాటే కార్యక్రమంలో నిమగ్నమయ్యారన్నారు. చెట్లు పెంపకం వల్ల కలిగే లాభాలను వివరించారు. రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలను తెలియజేశారు. ప్రజ లు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం వచ్చి రాష్ట్ర ప్రజానీకం ముందుకు వచ్చిందన్నారు. చెట్ల పెంపకం వల్ల పలు లాభా లున్నాయని, రాబోయే రోజుల్లో హరిత తెలంగాణను కళ్లారా చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, బీర్కూర్ సర్పంచ్ దూలిగ నర్సయ్య, టిఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.