Home తాజా వార్తలు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం…

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం…

 Child Labor

 

బాల కార్మికులను బడిలో చేర్పించండి..
బాలకార్మికులతో పనులు చేయించరాదు..
1986 బాలకార్మిక వ్యతిరేక చట్టం ప్రకారం రూ. 20వేల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష…
చైల్డ్ లైన్ 1098, డయల్ 100 నెంబర్,కంట్రోల్‌రూం నెంబర్ 08545-333331కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి..
ఎస్‌పి అపూర్వారావు..

వనపర్తి : 14 సంవత్సరాల్లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్దమని చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తులకు రూ. 20వేల జరిమానాతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని ఎస్‌పి అపూర్వారావు హెచ్చరించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్‌పి కార్యాలయంలో ఎస్‌పి అపూర్వారా వు డిఎస్‌పి. సిఐలు,ఎస్‌ఐలలతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి అపూర్వారావు మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్ బృందం లో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్, 4 కానిస్టేబుల్స్, విద్యాశాఖాధికారి, కార్మిక, శిశు సంక్షేమాధికారి కార్యాలయాల సిబ్బంది ఉంటారని పేర్కొ న్నారు.

14 ఏళ్ల లోపు బాలబాలికలను, చిన్నారులను వివిధ పనులకు ,కూలీ పనులకు పంపడం చట్టరిత్యా నేరమన్నారు. పనులకు పంపే పిల్లల తల్లిదండ్రులపై చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైన ఇటుక బట్టీల్లో, ఇండ్లల్లో ,ఫ్యాక్టరీల్లో, కిరాణ దుకాణాల్లో, బాలకార్మికులచే పని చేయించరాదని హెచ్చరించారు. రెవెన్యూ, విద్యా, కార్మిక, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌పి అపూర్వారావు వెల్లడించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూళనకోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్‌పి సూచించారు. చైల్డ్ లైన్ 1098, డయల్ 100 నెంబర్, కంట్రోల్‌రూం నెంబర్ 08545-333331కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈసమీక్షా సమావేశంలో డిఎస్‌పి సృజన, సిఐ సూర్యానాయక్, ఎస్‌ఐలు ,కానిస్టేబుల్స్ ఉన్నారు.

Let us Abolish the Child Labor System