Home తాజా వార్తలు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం… కెటిఆర్

అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం… కెటిఆర్

Minister KTRహైదరాబాద్ : నైజాం వ్యతిరేక పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను పురష్కరించుకుని కెటిఆర్ తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ ట్వీట్ చేశారు. నాటి నైజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో   ఎందరో తెలంగాణ వీరులు అమరులయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులు అర్పించారు. జై తెలంగాణ.. జై హింద్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎంఎల్ సిలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Let Us Commemorate Sacrifices Of Martyrs : KTR