Thursday, April 25, 2024

నదుల బాధను అర్థం చేసుకుందాం

- Advertisement -
- Advertisement -

Rivers

 

కాలుష్యం కోరల్లో కొట్టుమిట్టాడుతోంది ప్రపంచం. ముఖ్యంగా మనదేశంలో నదులు, సముద్రాలకు ప్లాస్టిక్ వల్ల పెను ముప్పు వాటిల్లుతోంది. ప్లాస్టిక్హ్రిత సమాజంగా మార్చడం అందరి బాధ్యత. జనాల్లో పర్యావరణంపై అవగాహన పెరిగితేగానీ ఈ ప్రమాదాన్ని అరికట్టలేం అంటోంది అపురూప. కాలుష్యానికి గురవుతున్న నదుల బాధను చిత్రాల ద్వారా చెబుతోంది.

పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తుందో అనే విషయాన్ని తన ఫొటోగ్రఫీ ద్వారా అవగాహన కలిగిస్తోంది విశాఖపట్నానికి చెందిన అపురూప.

ఈ నేపథ్యంలో కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నదుల ఆవేదనను చిత్రాల్లో చూపించింది. ఈ చిత్రీకరణకు ‘రివర్స్ ప్రాజెక్టు’ అనే పేరు పెట్టింది. ఎనిమిది నదుల బాధను ఎంతో హృద్యంగా చిత్రీకరించిందామె. ఈ చిత్రాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రదర్శించి సందర్శకుల ప్రశంసలు పొందింది. అసలు అపురూపకు ఈ ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే…కుటుంబ సభ్యులతో ఉజ్జయిని వెళ్లిన సందర్భాన్ని చెబుతోంది. నర్మదా నదే తన ఆలోచనలకు పునాది అంటోంది. అపురూప ఇంటర్‌లో ఉన్నప్పుడు వాళ్ల అమ్మ డీఎస్సెల్లార్ కెమెరాను బహుమతిగా ఇచ్చిందట. కుటుంబంతో కల్సి ఉజ్జయినికి వెళ్లిన ఆమెకు ఓ దృశ్యం విచారం కలిగించిందట. అక్కడి నర్మదా నదిని భక్తులు ఓ పక్క పూజిస్తూ, హారతులు ఇస్తున్నారు. మరోపక్క ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను నదిలో పడేస్తున్న దృశ్యం ఆమెను కదిలించివేసింది. అప్పుడు వచ్చిందే ఈ చిత్రాల ఆలోచన.

మనుషులు చేసే కాలుష్యానికి నదులు స్పందిస్తే ఎలా ఉంటుందో చిత్రాల ద్వారా చెప్పాలనుకుంది. అంతే ముందుగా గోదావరి, గంగ, కావేరి, యమున, తపతి, బ్రహ్మపుత్ర, యమున, కృష్ణా.. ఇలా మొత్తం ఎనిమిది నదుల గురించి అవగాహన ఏర్పరుచుకుంది. అందుకు సంబంధించిన పుస్తకాలను చదివింది. తన టీమ్ సభ్యులతో కలిసి చేసిన ఈ ప్రాజెక్టు వర్క్‌కి ఎంతో కష్టపడింది. మొత్తానికి విజయం సాధించింది. తన చిత్రాలను చూసిన కొంతమందైనా పర్యావరణాన్ని కాపాడేందుకు పూనుకుంటే తన శ్రమకు ఫలితం లభించినట్లే అంటోంది. పర్యావరణ కాలుష్యం గురించి ఫొటోల ద్వారా అవగాహన కల్పించడమే లక్షంగా పెట్టుకుంది.

తక్కువ ధరకు లభించే సింథటిక్ దుస్తులు, ప్లాస్టిక్ సంచీలు, ప్లాస్టిక్ బాటిల్స్…విందు వినోదాల్లో వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులను వాడొద్దని తన చిత్రాల ద్వారా చెబుతానంటోంది. ఇవన్నీ భూమిలో కలిసిపోకుండా పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి. పర్యావర అనుకూల దుస్తులు, గుడ్డ సంచులు, వెదురు ఇలాంటివి ఉపయోగించమని అవగాహన కల్పిస్తోంది అపురూప.

Let us understand suffering of Rivers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News