* మూన్నాళ్లకే పాడైపోయిన తారు రోడ్డు
* ప్రజల సొమ్ము కంట్రాక్టర్ల పాలు
* మామూళ్ల ముసుగులో నాణ్యతను పట్టించుకోని అధికారులు
మనతెలంగాణ/కుబీర్: మండలంలోని భైంసా—— సుండి పార్డి(బి) తారు రోడ్డు పనులు కంచే చేను మేస్తే ఇలావుంటుందన్న వైనంగా పనులు జరిగాయి. రూ.2.6కోట్లతో భైంసా నుండి పార్టీ (బి) మీదుగా మర్లగొండ వరకు పది కిలోమీటర్ల తారు రోడ్డు పనులు జరి గాయి. మామూళ్ల ముసుగులో సంబందిత శాఖ అధికారులు నాణ్యతను పట్టించుకోలేక పోయారన్న విమర్శలుఉన్నాయి. పది కాలల పాటు మన్నికగా ఉండాల్సిన తారురోడ్డు మూన్నాల్లకే గుంతల మ యంగా మారింది. ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలుచేసి నాణ్య తనుపట్టించుకోలేదని అధి కారులపై మండ ల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు పూర్తయి గుంతల మ యంగా మారుతున్న రోడ్డు పక్కన సైడు మొరం ఇం తవరకు వేయలేక పోవడంతో ఆర్ యండ్‌బి అధికారుల పనితీరును అర్థం చేసు కోవచ్చు. సైడు మొరం వేయక పోవ డంతో రోడ్డు పడై పోవడమేకాక ద్విచక్ర వాహనదారులు రోడ్డు దిగి పైకి రావాలన్న ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రోడ్డు పనులపై ఎన్నో రకల పర్య వేక్షణలు, పరిశీలనులున్నా పనులు సక్ర మంగా జరగలేదని ఆరోపణలున్నాయి. పనులపై సంబందిత శాఖ అధికారులు క్వాలిటీ కంట్రోలింగ్ అధికారులతో విచా రణ జరిపించి రోడ్డు బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
* నోటీసులు జారి చేసాం: ఆర్‌యండ్‌బి డిప్టి రవీందర్ రెడ్డి
రోడ్డు గుంతల మయంగా మారడంతో సంబ ందిత కాంట్రాక్టరుకు నోటీసులు జారీ చేయ డం జరిగింది. త్వరలోనే గుంతలకు మరమ త్తులు చేసి రోడ్డును బాగు చేయిస్తాం. సం బందిత కాంట్రాక్టర్ డిపాజిట్లను నిలిపివేశాం.