Home కామారెడ్డి మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేరుద్దాం

మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేరుద్దాం

hall

మన తెలంగాణ/కామారెడ్డి: స్వాతంత్య్రం కన్నా పారిశుధ్దం ముఖ్యమన్న మహా త్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జనహిత భవన్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి, స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ మల విసర్జన రహిత కార్యక్రమంలో స్వచ్ఛందంగా విద్యార్థి, విద్యార్థులు పాల్గొనడం గొప్పవరం అన్నారు. జుక్కల్ మండలంలో ఎంఎస్‌డబ్య్లు మాస్టర్ సోషల్ వర్కర్స్ 60 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ రాష్ట్ర క్యాంపస్ విద్యార్థులు ఇంటింటా వ్యక్తిగత మరుగు దొడ్డి నిర్మాణం అవగాహన కార్యక్రమానికి హాజరవ డం ఎంతో ఆదర్శంగా ఉందన్నారు. మహాత్మాగాంధీ బోధించిన విధంగా తన కోసం చేస్తే తనతోనే , దేశం కోసం కోస్తే శాశ్వతమవుతుందనే సూక్తిని ఆచరించాలన్నారు. జుక్కల్ మండలంలోని 19 గ్రామాల్లో రెండు రోజుల పాటు విద్యార్థులు ప్రతి గ్రా మంలో అవగాహన కల్పిస్తారన్నారు. ఉదయం 6 గంటలకే బహిర్భూమి వెళ్లే వారిని బయటకు వెళ్లద్దని దాని వల్ల చేతులు, పరిసరాలపై అపరిశుభ్రత వాతావరణం ఏర్పడుతుందన్నారు. అంటువ్యాధులు అతిసార, జిగల విరోచనాలు కలుగుతాయనే విషయాన్ని గ్రామస్థులకు తెలపాలన్నారు. గ్రామాలలో ముఖ్యంగా అంటు వ్యాధుల గురించి తెలియకపోవడం,అవగాహన లేకపోవడం కారణాలని వీటిని దృష్టిలో ఉం చుకుని వారికి అవగాహన కల్పించాలన్నారు. స్వాతంత్య్రం కన్నా పారిశుద్ధం ముఖ్యం అన్న మహాత్మాగాంధీ ఆశయాన్ని పాటించాలన్నారు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ మండలం చాలా వెనుక బడి ఉందని ఈ విషయంలో స్వచ్చ సమాజ సేవకుల అవసరం ఉందన్నారు. రూర్బన్ పథకం కింద జుక్కల్ మండలంలో అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఉన్న 13వేల మరుగు దొడ్ల నుండి 1 లక్ష మరుగుదొడ్ల నిర్మా ణం చేశామన్నారు. జిల్లాలోని 323 గ్రామాలకు గాను 171 గ్రామాలను వోడియఫ్ గ్రామాలుగా ప్రకటించుకున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ యాక్ట్ 1964, 2009, 2013 యాక్ట్ ప్రకారం ప్రతి ఇంటికి తప్పని సరాగా మరుగుదొడ్డి నిర్మాణం కలిగి ఉండాలని చట్టం చెబుతుందన్నారు. ఈ చట్టాలను ప్రతి గ్రామంలో తెలియజెప్పాల్సిన అవసరముందని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా కామారెడ్డిని నిర్మించేందుకు చక్కటి టీం వర్కుతో పనిచేయాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. జెసి సత్తయ్య మాట్లాడుతూ జుక్కల్ మండలం వెనుక బడి ఉందని పరిశుభ్రత, పారిశుద్ధంపై అందరికి అవగాహన కల్పించాలని , ఇది విద్యార్థులకు ఒక ప్రాజెక్టు వర్కులాగా ఉపయోగ పడుతుందన్నారు. అనంతరం జిల్లా కేంద్రం నుండి జుక్కల్‌కు విద్యార్థి విద్యార్థులను తీసుకెళ్లే బస్సును కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, స్వచ్ఛభారత్ మిషన్ సౌత్ క్యాంపస్ అధికారి అంజయ్య, ఆర్కే డిగ్రీ కళాశాల ఫ్యాకల్టీ విశ్వనాథ్, స్వచ్చభారత్ మిషన్ సిబ్బంది శంకర్, రమాదేవి, నారాయణ, సిబ్బంది, తదితరులు పాల్గన్నారు.