Saturday, April 20, 2024

ముంబై పోలీసులను అభినందించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -
KTR
ముంబై లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రవేశపెట్టన డెసిబల్ మీటర్లు

హైదరాబాద్:ముంబాయి పోలీసులు మలు చేస్తున్న ఈ ఫార్ములాపై మంత్రి కెటిఆర్ ఆసక్తి కనబర్చారు. హైదరాబాద్‌లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముంబాయి పోలీసులు అమలు చేస్తున్న ఈ విధానాన్ని తెలంగాణ డిజిపి, హైదరాబాద్ సిపి,జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు ఆయన ట్యాగ్ చేశారు. అయితే శబ్దకాలుష్యం నియంత్రణతో పాటు ట్రాఫిక్ రణగొణధ్వనులు తగ్గించేందుకు ఇటీవల ముంబాయి పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర డెసిబల్ మీటర్లను ప్రవేశపెట్టారు.

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఐదారువరుసల్లో వాహనాలు ఆగుతుంటాయి. ఆ సమయంలో వెనుకాలనుంచి వాహనాల మోత మోగుతుంటుంది. రెడ్‌సిగ్నల్ పడినా కొందరు వాహదారులు హారన్ కొడుతుండటంతో ధ్వనికాలుష్యం పెరగడంతో పాటు ముందుగా ఉన్నవారు హారన్ మోతలు భరించ లేక ట్రాఫిక్ లైన్‌ను దాటాల్సి వస్తోంది. అప్పటికే వాహనాల నుంచి వెలుబడే వాయువు కాలుష్యం అవుతుండగా దీనికి తోడు హారన్‌మోతలతో శబ్దకాలుష్యం పెరుగుతుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి ముంబాయి పోలీసులు సిగ్నళ్లదగ్గర డెసిబల్‌మీటర్లను ఏర్పాటు చేశారు. సిగ్నల్ పడ్డప్పుడు వాహన దారులు హారన్ కొడితే ఎంత ధ్వని వస్తోందో ఆమీటర్లలో నమోదు అవుతుంది.

ఒకవేళ హారన్ శబ్దాలు 85 డెసిబల్స్ దాటితే రెడ్‌సిగ్నల్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. అలా హారన్ మోతలు తగ్గేంతవరకు గ్రీన్‌సిగ్నల్ లభించదు. ఎక్కువగా హారన్ కొడుతూ ట్రాఫిక్‌ను ఇబ్బందికి గురిచేసినా, నిబంధనలు పాటించకుండా వెళ్లినా జరినామాలు కఠినంగా ఉండేవిధానాలను అక్కడ అమల్లోకి తెచ్చారు. ఈ విధానాలను పరిశీలించి హైదరాబాద్‌లో ప్రవేశపెడితే శబ్దకాలుష్యానికి కళ్లెం వేయవచ్చనే ఆలోచనలతో కెటిఆర్ రాష్ట్రపోలీసులకు ముంబాయిపోలీసుల ట్విట్టర్ షేర్ చేశారు.

Lets get this done in our Hyderabad too says ktr

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News