Home జోగులాంబ గద్వాల్ పత్తిమిల్లులో పనిచేసే బాలకార్మికులకు విముక్తి

పత్తిమిల్లులో పనిచేసే బాలకార్మికులకు విముక్తి

ladyఆగ్రహించిన కలెక్టర్.. రంగంలోకి రెవెన్యూ అధికారులు 

మనతెలంగాణ/గద్వాల అర్బన్: బాలకార్మికులకు నిలయంగా మారి న జోగుళాంబగద్వాల జిల్లాలో జిల్లా ఉన్నతాధికారులు ఎన్నిరకాల చ ర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనబడడం లేదు. బాలకార్మికుల నిర్మూలనకు అటు, కలెక్టర్, ఎస్పీ లు కట్టుదిట్టమై న చర్యలు తీసుకునే క్రమంలో సోమవారం మరోమారు జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పలు పత్తిజి న్నింగు మిల్లులపై దాడులు నిర్వహించారు. కొండపల్లి,అయిజ రోడ్లలో ని పత్తి జిన్నింగ్ మిల్లులపై నిర్వహించిన దాడుల్లో పలువురు బాలకా ర్మికులు పనిచేస్తుండటాన్ని గుర్తించారు. వారిని అక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టరేట్‌కు తలరించారు. పనులు చేయించుకుంటున్న పత్తిమిల్లు ల యజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసు కుంటామన్నారు. ఈదాడిలో జిల్లా రవాణాశాఖాధికారులు, లేబర్ కమీషనర్ అధికారులు పాల్గొన్నారు. బాలకార్మిక చట్టం ప్రకారం పత్తి మిల్లులలో పనిచేస్తున్న బాలలను అదుపులోకి తీసుకున్నారు. బాలల తల్లిదం డ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, 14 ఏళ్ల లోపు చిన్నారులను పనిలో పెడితే చట్టరిత్యా నేరమని బాలలకు తప్పనిసరిగా బడికి పంపించాలని డిటిఓ తెలిపారు. బాలలను కలెక్టర్ కార్యాలయానికి తరలించి కలెక్టర్ కి అప్ప గించారు. బాలలను పనిలో పెట్టుకున్న పత్తిమిల్లుల యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.