Home అంతర్జాతీయ వార్తలు LIC అసిస్టెంట్ పరీక్ష హల్ టికెట్లు విడుదల

LIC అసిస్టెంట్ పరీక్ష హల్ టికెట్లు విడుదల

LIC

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ డివిజన్ల పరిధిలోని 8 వేలకుపైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గత కొద్దిరోజల క్రితం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సౌత్ రీజియన్‌లో మొత్తం 631 పోస్టులు ఉండగా.. అందులో తెలుగు రాష్ట్రాలకు 276 పోస్టులు కేటాయించారు. షెడ్యూలు ప్రకారం ఈ పరీక్ష అక్టోబరు 21, 22 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా అక్టోబరు 30, 31వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా ఈ పరీక్ష హల్ టికెట్లను అధికారిక వెట్ సైట్ లో LIC ఉంచింది. అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ హల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబర్ 30,31వ తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష ఆన్ లైన్ విధానంలో జరగనుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

LIC Assistant Hall Tickets release