Home తాజా వార్తలు మార్చిలో ఎల్‌ఐసి ఐపిఒ

మార్చిలో ఎల్‌ఐసి ఐపిఒ

LIC IPO may be launched by march 15

 

ఈనెలాఖరున ఐపిఒ కోసం దరఖాస్తు

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) ఈ నెలలో ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించనుంది. ఈ ఐపిఒను మార్చి 15 నాటికి ఐపిఒ ప్రారంభం కావచ్చని అంచనా. అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వారంలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానుంది. ఎల్‌ఐసి దేశంలోనే అతిపెద్ద ఐపిఒ, దీని ద్వారా ప్రభుత్వం 10-15 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ.90,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వ రకు సమీకరించనుంది. జనవరి చివరి వారం లో కంపెనీ ఈ ఒపిఒ కోసం ప్రాస్పెక్టస్‌ను దరఖాస్తు చేసే అవకాశముంది. ప్రభుత్వం ఎల్‌ఐసి విలువను రూ. 15 లక్షల కోట్లు అంచనా వేయాలని ఒత్తిడి చేస్తోంది. ఎల్‌ఐసి ఐపిఒ కో సం జారీ చేయవలసిన ప్రాస్పెక్టస్‌లో ఈ విలువను చేర్చాల్సి ఉంటుంగది. ఎల్‌ఐసి అంచనా విలువను నిర్ణయించడానికి సంబంధించిన తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ రూ. 15 లక్షల కోట్ల విలువతో లిస్ట్ అయితే, అది రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో సమానమైన విలువ కల్గిన సంస్థగా ఉంటుంది.

LIC IPO may be launched by march 15