Thursday, April 25, 2024

66వ వార్షికోత్సవంలోకి ఎల్‌ఐసి

- Advertisement -
- Advertisement -

LIC is entering its 66th anniversary on September 1

గతేడాదిలో రూ.1,47,754 కోట్ల విలువచేసే 229.15 లక్షల క్లెయిమ్‌లు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి ఎల్‌ఐసి (భారతీయ జీవిత బీమా సంస్థ) 66వ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతోంది. ఈ సంస్థ స్థాపించిన ఈ కాలంలో ఎల్‌ఐసి సుమారు 14 దేశాల్లో విస్తరించింది. ఎల్‌ఐసి జీవిత బీమా ఆవశ్యకతను తెలియజేస్తూనే, అందరికీ అందుబాటు ధరలో బీమాను అందిస్తోంది. 1956 సంవత్సరంలో రూ.5 కోట్ల ప్రాథమిక మూలధనంతో ప్రారంభించ ఎల్‌ఐసి, ఈ రోజు రూ.38,04,610 కోట్ల నికర విలువ కల్గిన సంస్థగా వృద్ధిని సాధించింది. దీనిలో రూ.34,36,686 కోట్ల విలువ లైఫ్ ఫండ్ ఉంది. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 సర్వే ప్రకారం, ఎల్‌ఐసి ప్రపంచంలో 3వ పటిష్టమైన, 10వ అత్యంత విలువైన బ్రాండ్‌గా ర్యాంక్‌ను సాధించింది.

బీమా రంగంలో రెండు దశాబ్దాల కాలంలో 66.18 శాతం మార్కెట్ వాటా, పాలసీ సంఖ్యలో 74.58 శాతం వాటాతో సంస్థ మార్కెట్ లీడర్‌గా నిలిచింది. 202021లో ఎల్‌ఐసి 2.10 కోట్ల కొత్త పాలసీలను విక్రయించింది. అదే సమయంలో ప్రీమియంలో కొత్త వ్యాపారంలో 3.48 శాతం వృద్ధిని సాధించింది. ఎల్‌ఐసి 8 జోనల్ ఆఫీస్‌లు, 113 డివిజనల్ ఆఫీస్‌లు, 74 కస్టమర్ జోన్లు, 2048 బ్రాంచ్ ఆఫీస్‌లు, 1546 శాటిలైట్ ఆఫీస్‌లు, 42 వేలకు పైగా ప్రీమియం పాయింట్లు, ఒక లక్షకు పైగా ఉద్యోగులు, 13.53 లక్షల మంది ఏజెంట్లతో సంస్థ ఉత్తమ సేవలందిస్తోంది. 202021లో రూ.1,47,754 కోట్ల విలువచేసే 229.15 లక్షల క్లెయిమ్‌లు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News