Friday, April 19, 2024

50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్ నుండి భారీ లాభాలను ఆర్జించింది. కానీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు నష్టపోతూనే ఉన్నాయి ఈ కారణంగా అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఎల్‌ఐసి కూడా ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది. అదానీ గ్రూప్ షేర్లు గత నెల నుండి భారీ అమ్మకాలను చూస్తున్నాయి. దీని వల్ల ఎల్‌ఐసికి గత 50 రోజుల్లోనే రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లింది. స్టాక్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఎల్‌ఐసి ఏడు అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ టోటల్ గ్యాస్.

అదానీ ట్రాన్స్‌మిషన్, అంబుజా సిమెంట్స్, ఎసిసి వంటి కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసింది. అదానీ గ్రూప్‌లోని ఈ ఏడు షేర్లలో ఎల్‌ఐసి పెట్టుబడి విలువ 2022 డిసెంబర్ 31 నాటికి రూ. 82,970 కోట్లుగా ఉంది. ఈ విలువ 2023 ఫిబ్రవరి 23 నాటికి రూ.33,242 కోట్లకు తగ్గింది. అంటే 50 రోజుల్లో అదానీ షేర్లలో ఎల్‌ఐసి పెట్టుబడి విలువ రూ.49,728 కోట్లు తగ్గింది. జనవరి 24 వచ్చిన హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ అకౌంటింగ్‌లో మోసం చేసిందని, షేర్ ధరలను తారుమారు చేసిందని ఆరోపించారు. అయితే హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదానీ గ్రూప్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News