Thursday, April 25, 2024

ఎల్ఐసి పెట్టుబడులు.. ఆల్ టైమ్ కనిష్టానికి

- Advertisement -
- Advertisement -

LIC ownership in Indian companies declined

రూ.1.7 లక్షల కోట్లు తగ్గిన పెట్టుబడి విలువ

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) పెట్టుబడుల విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలలో ఎల్‌ఐసి తన వాటాను గణనీయంగా తగ్గించింది. 2020 మార్చి 31 నాటికి ఎల్‌ఐసి సంస్థ పెట్టుబడుల వాటా 3.8 శాతానికి తగ్గింది. దీంతో పెట్టుబడి విలువ రూ .1.7 లక్షల కోట్లకు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌ఎస్‌ఇ ఇన్‌ఫోబేస్.కామ్ గణాంకాల ప్రకారం, 2020 మార్చి 31 నాటికి లిస్టె డ్ కంపెనీల్లో ఎల్‌ఐసి యాజమాన్యం 3.88 శాతానికి పడిపోయింది.

లిస్టెడ్ షేర్ల లో ఎల్‌ఐసి పెట్టుబడుల విలువ 2019 డిసెంబర్ 31న 6.04 లక్షల కోట్లు ఉండగా, ఇది 2020 మార్చి31 నాటికి రూ.4.24 లక్షల కోట్లకు క్షీణించింది. ఫ్రీ-ఫ్లోట్ ప్రాతిపదికన, భారతీయ కంపెనీలలో ఎల్‌ఐసి యాజమాన్యం రికార్డు స్థాయిలో 7.85 శాతానికి పడిపోయింది. ఇంతకుముందు 2018 మార్చి 31న ఇది 4.17 శాతానికి పడిపోయింది. 2019 మార్చి 31 నాటికి ఇది 4.20 శాతానికి పెరిగిం ది. మళ్లీ 2020 మార్చిలో ఇది 3.88 శాతానికి పడిపోయింది. విలువ పరంగా, 2017 డిసెంబర్ నాటికి నాటికి ఎల్‌ఐసి విలువ రూ .6.27 లక్షల కోట్లు, అయితే ఎల్‌ఐసి అత్యధిక విలువ పెట్టుబడి ఇదే. ఎల్‌ఐసి ఇటీవల పలు కంపెనీల్లో వాటాలను విక్రయించింది.

అనేక ప్రభుత్వరంగ సంస్థలు, అప్పు ల భారం కలిగిన సంస్థలలో తన పెట్టుబడులను ఉపసంహరించుకుంది. కరోనావైరస్ కారణంగా ఎల్‌ఐసి పోర్ట్‌ఫోలియోలో షేర్లు భారీగా పడిపోయాయి. టాటా మోటార్స్, టాటా కెమికల్స్, ఇండియాబుల్స్ హౌసింగ్, ఎడెల్విస్ ఫైనాన్షియ ల్, జిఐసి హౌసింగ్, కెనరా బ్యాంక్, ఫ్యూచర్ గ్రూప్, అనిల్ అంబానీ నియంత్రిత సంస్థలలో ఎల్‌ఐసి హోల్డింగ్స్ మార్చి త్రైమాసికంలో 50% నుంచి 70% మధ్య క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసిని జాబితా చేయాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికలు ప్రభుత్వానికి ఉన్నాయి. ఎల్‌ఐసి విలువ ప్రస్తుతం రూ .1-1.5లక్షల కోట్లుగా ఉంది.

LIC ownership in Indian companies declined

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News