Home హైదరాబాద్ మూడు సార్లు దొరికితే… లైసెన్స్ రద్దు

మూడు సార్లు దొరికితే… లైసెన్స్ రద్దు

Trafic-POLICE

మనతెలంగాణ/సిటీబ్యూరో: ఒక సారి చేస్తే పోరపాటు, రెండో సారి చేస్తే గ్రహపాటు, మూడో సారి చేస్తే అలవాటు. ఈ సామెత ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే వారికి సరిగ్గా సరిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించిన రవాణా శాఖతో కలిసి ట్రాఫిక్ అధికారులు అదే పనిగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పా ల్పడితే వారి వాహన లైసెన్స్‌ను రద్దు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. భద్రతతో కూడిన ప్రయాణానికి పెద్ద పీట వేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటనలకే పరిమితమైన అధికారులు ఇక వాహన దారులపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే అనేక మంది వాహన దారుల లైసెన్స్‌లపై రెండు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. అదే పనిగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ దొరికితే ఏకంగా లైసెన్స్ రద్దు చేయాల ని అధికారులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభు త్వ స్థాయిలో చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. గ్రే టర్‌లో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిత్యం 1000 నుంచి 1500 కొత్త వాహనాలు రోడ్లమీదకు వ స్తున్నాయి. ఇప్పటికే వాహనాల సంఖ్య 47 లక్షలకు పైగా దాటింది.

వాహనాల రద్దీతో అనేక ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. విచ్చల విడిగా ట్రాఫిక్ ఉల్లంఘనలతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గ్రేటర్ వ్యా ప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1000కి పైగా రోడ్డు ప్ర మాదాలు చోటు చేసుకోవడమే కాకుండా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 90 శాతం మానవ తప్పిదాల కా రణంగానే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సి గ్నల్ జంపింగ్, అతి వేగంగా నడపడం, వ్యతిరేక దిశలో ప్ర యాణించడం,తాగి నడపడం,సెల్‌ఫోన్ డ్రైవింగ్,సీటు బెల్ట్, హెల్మెట్ ధరించక పోవడం లాంటి కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని సార్లు జరిమానాలు విధించినా అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. కొందరైతే ఐదా రు సార్లు చలానాలు చెల్లిస్తున్నా సరే దర్జాగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రవాణా, ట్రాఫిక్ అధికారులు సంయుక్తంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు.

కొన్ని రోజులుగా ట్రాఫిక్ ఉల్లంనలకు సంబంధించి లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తున్నారు. అవే త ప్పులు మూడు సార్ల కంటే ఎక్కువగా చేస్తే కఠినంగా లైసెన్స్ రద్దు చేయడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లైసెన్స్ పొందే అ వకాశం లేకుండా చేయాలని నిర్ణయించారు.లైసెన్స్‌లు స స్పెండ్‌కు గురైన వాహనాలు రోడ్ల మీదకు వస్తే క్రిమినల్ కే సులు నమోదు చేయడమే కాకుండా కోర్టుకు కూడా పంపిస్తామని రవాణాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వి ద్యార్థులు, యువత అయితే చాలా చిక్కుల్లో పడతారని వారు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పా టించాల్సిందే అని , వాహన దారులను ఇబ్బందులకు గురి చేసేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపా రు. వాహన దారుల భద్రత మాకు చాలా ముఖ్యమని, ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా చాలా మంది తీరులో మార్పు కనిపించక పోవడంతో ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదంటున్నారు.